ముగ్గురు దుర్మార్గులు ముప్పేట దాడి

ముగ్గురు దుర్మార్గులు ముప్పేట దాడి
April 04 18:03 2019

ఎన్నికల సమయంలో ఐటీ దాడులు, పాత కేసుల్ని తిరగతోడి టీడీపీని టార్గెట్ చేశారంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ముగ్గురు దుర్మార్గులు ఏకమై ముప్పేట దాడికి దిగారని.. రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలే దీనికి ఉదాహరణన్నారు. గురువారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఎన్నికల వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. మోదీ, కేసీఆర్,జగన్‌లు రాష్ట్రంపై ముప్పేట దాడులు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. కక్షసాధింపుతో టీడీపీ నేతలపై మోదీ ఐటీ దాడులు చేయిస్తున్నారని.. పార్టీ నేతలపై ఉన్న పాత కేసుల్ని కేసీఆర్ బయటకు తీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంపై ఎన్ని కుట్రలు చేయాలో.. అన్ని కుట్రలు చేస్తున్నారంటున్నారు. ఓటమి భయంతోనే ముగ్గురు కలిసి బీసీ నేతల్ని టార్గెట్ చేశారంటున్నారు. మొన్న బీద మస్తాన్ రావు… నిన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇళ్లపై దాడులే ఉదహరణన్నారు. వైసీపీ వ్యాపారులపై.. టీఆర్ఎస్ కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు చేయరా అని ప్రశ్నించారు చంద్రబాబు. బీజేపీ టీడీపీ, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీలనే బీజేపీ టార్గెట్ చేస్తోందన్నారు. జగన్ కేసుల మాఫీయే మోదీ దృడ సంకల్పం.. అందుకే జగన్ కంటికి మోదీ దృడ చిత్తం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ అడ్డకునేందుకు దుష్ట ప్రయత్నాలు చేశారని.. డమ్మీ ఈవీఎంలను కూడా నియోజకవర్గాల్లోకి దించుతున్నారని ఆరోపించారు. ఓటర్లకు కూపన్ కార్డులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయంటున్నారు చంద్రబాబు.చంపడమో, చావడమో అంటూ వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని.. మైలవరంలో పోలీసులు, జవాన్లపై వైసీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో దాడులు చేయడం దారుణమన్నారు. గ్రామాల్లో దారి మూసేస్తామని.. గుడిసెలు పీకేస్తామని పుంగనూరులో బెదిరింపులకు దిగుతున్నాని ఆరోపించారు. పొన్నూరులో స్కూల్ పిల్లల ఆటోపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. చివరికి అద్దెకు ఉండే వాళ్లను అర్ధరాత్రి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో గర్భిణి మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చటం… వృద్ధులనే కనికరం లేకుండా అర్ధరాత్రి సామాన్లు బయట పడేశారన్నారు.వైసీపీ దౌర్జన్యాలు చూస్తుంటే.. వైసీపీకి ఓటేస్తే మన ఇళ్లలోనే మనం అద్దెకు ఉండాల్సి వస్తుందేమోనన్నారు. వైసీపీ కుట్రలు, దౌర్జన్యాలకు నిరసనగా ప్రతి రోజూ గంటసేపు ర్యాలీలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ ఏజెంట్లను కొంటామని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని.. కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ పార్టీని కాపాడుకోవాలని.. ఆంధ్రుల సత్తా ఏంటో మోదీకి, కేసీఆర్‌లకు తెలియజేయాలన్నారు. ఎవరి సొంత ఇంట్లో అయినా, వారే అద్దెకు ఉండాలని భావిస్తే వైసీపీకి ఓటు వేయాలని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. జగన్ కు, ఆయన నిలిపిన అభ్యర్థులకు ఓటు వేస్తే, ఉన్న సొంతింటికి అద్దె చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని, రాష్ట్రం అరాచకమై పోతుందని హెచ్చరించారు.  చంద్రబాబు, రాష్ట్రంపై దుష్ట చతుష్టయం కుట్రలు చేస్తోందని, పోరాడేందుకు, అభివృద్ధిని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగానూ కేంద్రం ఇబ్బంది పెడుతోందని, కోర్టులో ఎన్నడో కొట్టేసిన వంశీ పాత కేసును తిరగదోడి, అరెస్ట్ వారెంట్ ను జారీ చేయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  వైసీపీ నేతలు పోలీసులపైనే దాడులకు దిగుతున్నారని, ఓడిపోతామన్న భయం వారిని వెంటాడుతోందని, ప్రజలు మాత్రం టీడీపీకి అండగా ఉన్నారని అన్నారు. పోలీసులపై చెప్పులు, రాళ్లు వేశారని, స్కూలు పిల్లలపైనా వారు దాష్టీకాలకు దిగుతున్నారని, వైసీపీ నేతలు తమ ఇళ్లలో అద్దెకుండే టీడీపీ సానుభూతిపరులను కూడా వదలడం లేదని, గర్భిణీలని, వృద్ధులని కూడా చూడటం లేదని మండిపడ్డారు.వీరి ఆగడాలకు చరమగీతం పాడే అధికారం ప్రజల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేయడం ద్వారా నేరస్థులకు అధికారం దక్కకుండా చూడాలని కోరారు. ఐటీ దాడులు కేవలం టీడీపీ నాయకులపైనే జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన, వైసీపీ నేతలపై ఎందుకు దాడులు జరగడం లేదని ప్రశ్నించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26320
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author