న్యాయ్ తో బీజేపీకి షాకే.

న్యాయ్ తో బీజేపీకి షాకే.
April 04 18:18 2019

ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఉత్సాహంగా ఉన్న బీజేపీలో ఎన్నికలు సమీపించేకొద్దీ ఆందోళన కనిపిస్తోంది. ఈసారి కూడా తమదే అధికారం అని చంకలు గుద్దుకున్న కమలదళాన్ని ఒకే ఒక్క ప్రకటనతో ఆలోచనలో పడేశారు ఏఐసీపీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కనీస ఆదాయం లేని పేద కుటుంబాలకు నెలకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.72వేలు బ్యాంకు ఖాతాలో వేస్తామని రాహుల్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్‌ తమకు రాజకీయ ప్రయోజనం చేకూరుస్తాయని సంబరపడుతున్న బీజేపీకి కాంగ్రెస్ ‘న్యాయ్’తో షాకిచ్చింది. ఈ పథకంపై బహిరంగంగా విమర్శలు గుప్పించిన బీజేపీ దాని ప్రభావంపై అంతర్గతంగా సర్వేలో షాకిచ్చే విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. రైతాంగం సంక్షోభంలో ఉన్న 30 స్థానాల్లో తమకు ఓటమి తప్పదని సర్వేలో తేలినట్లు సమాచారం. తనను బలమైన జాతీయవాదిగా, చౌకీదార్‌గా మోదీ తనను చిత్రీకరించుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ప్రకటన బీజేపీకి అశనిపాతంలా పరిణమించినట్లు తెలుస్తోంది. ఇది కచ్చితంగా తమ విజయావకాశాలు దెబ్బతీస్తుందని కమలదళంలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో ఓటింగ్ సరళిపై రాహుల్ కనీస ఆదాయ పథకం ప్రభావం చూపుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాజస్థాన్‌లో 25, జార్ఖండ్‌లో 12, మధ్యప్రదేశ్‌లో 27, ఛత్తీస్‌గఢ్‌లో 10 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు న్యాయ్ పథకంతో ఈ సీట్లలో ఎంతో కొంత కోత పడటం ఖాయమని బీజేపీ నేతలే అంగీకరిస్తున్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26334
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author