ఫిర్యాదులు పరిశీలనకు క్షేత్రస్థాయిలో 190 మంది అధికారులు

ఫిర్యాదులు పరిశీలనకు క్షేత్రస్థాయిలో 190 మంది అధికారులు
April 04 18:32 2019

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన గురించిన అనేక ఫిర్యాదులు మరియు వివిధ పోలీసు మరియు ఇతర శాఖల అధికారుల గురించిన ఫిర్యాదులు ప్రతిరోజూ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి అందుతున్నాయి. కేవలం ఇందు నిమిత్తమే ఫిర్యాదుదారులు చాలా దూరప్రాంతాల నుండి వస్తున్నారు.ఎన్నికల నిర్వహణను సజావుగా జరిపేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, రిటర్నింగ్ అధికారులు మరియు ఇతర క్షేత్రస్థాయి అధికారులతో పాటు 190 మంది పరిశీలకులను  భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమించిందని సంబంధితులందరికి తెలియజేయదం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, గోపాల్ కృష్ణ ద్వివేది,తెలిపారు.190 మంది పరిశీలకులలో, 102 మంది ఆదాయ పన్ను మరియు కస్టమ్స్ శాఖ సీనియర్ అధికారులను వ్యయ పరిశీలకులు గాను,  75 మంది ఇతర రాష్ట్రాల సీనియర్ ఐఎఎస్ ఆధికారులను సాధారణ పరిశీలకులు గాను, అంతే కాకుండా 13 మంది ఇతర రాష్ట్రాల సీనియర్ పోలీస్ అధికారులను పోలీస్ పరిశీలకులు గాను నియమించడమయిందని పేర్కొన్నారు.ఎన్నికలకు సంబంధించిన ఏదేని ఫిర్యాదును జిల్లా కలెక్టర్లు, ఎస్¬పిలు మరియు రిటర్నింగ్ అధికారులతో పాటు నియోజకవర్గంలోనే బస చేసి ఉన్న పరిశీలకులకు కూడా ఇవ్వవచ్చునని ఆయనతెలియజేసారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26350
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author