నేతలు… నేరచరితలు

నేతలు… నేరచరితలు
April 05 11:36 2019

మరొక ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది ఉంది ఏ పార్టీ ఓడిపోతుంది అన్న చర్చలు, విశ్లేషణలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నడుస్తున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల లో ఎంతమంది నేర చరిత్ర కలిగిన వారు, ఎంత మంది అవినీతి ఆరోపణలు కలిగినవారు, ఎంతమంది వేర్వేరు రకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాల కారణంగా కేసులు ఎదుర్కొంటున్నారు అన్న చర్చ మీడియాలో కూడా జరగడం లేదు. ఎంతసేపు ఏ అభ్యర్థికి ధన బలం ఎక్కువ ఉంది, ఏ అభ్యర్థికి కుల బలం ఎక్కువ ఉంది, ఏ అభ్యర్థి ఏదో ఒకటి చేసి గెలిచే సామర్థ్యం కలిగి ఉన్నాడు- ఇలాంటి అంశాల మీద చర్చ నడుస్తోంది. అయితే పూర్తిస్థాయి జాబితా కాదు కానీ కనీసం ఏ ఏ అభ్యర్థులు ఎలాంటి కేసులను గతంలో ఎదుర్కొన్నారు లేదా ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు అన్నవి టూకీగా పరిశీలిస్తే ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో కొన్ని కేసులు, తర్వాత కొట్టివేయబడ్డ ఉండవచ్చు, కొన్ని కేసులు వీగిపోయి ఉండవచ్చు. ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కొరకు మాత్రమే. ఆ కేసులకు సంబంధించిన అసలు వివరాలు స్థానికులైన ప్రజలకు మరింత బాగా తెలిసే ఉంటుంది. ఓటర్లు ఎన్నికల అఫిడవిట్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మరింత బాగుంటుంది. వై ఎస్ ఆర్ సి పి ముందుగా, వై ఎస్ ఆర్ సి పి నేతల వివరాలు పరిశీలిస్తే వారి కేసు ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇది పూర్తిస్థాయి జాబితా కాదని, కేవలం పైపైన కొందరు అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే వచ్చిన జాబితా అని గమనించగలరు. తెలుగుదేశం: ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఇందులో తాము ఏమాత్రం తక్కువ తినలేదని నిరూపిస్తోంది. దెందులూరు ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న చింతమనేని ప్రభాకర్ మీద కేసులు, ఆరోపణలు, వీడియో సాక్షాలు అన్ని కలిపి సంపుటీకరిస్తే చాట భారతమే అవుతుంది. మరొక టిడిపి నేత బోండా ఉమా (విజయవాడ సెంట్రల్) భూ కబ్జా ఆరోపణలు, దానిమీద దాఖలైన కేసులు, అలాగే ఆర్టీవో అధికారిని బెదిరించడం దాడి చేయడం వంటి సంఘటనలు ప్రజల మస్తిష్కాల్లో ఇంకా తాజా గానే ఉన్నాయి.ఆర్టీవో అధికారి మీద దాడి చేసిన సంఘటనలో బోండా ఉమా తో పాటు పాల్గొన్న మరొక టిడిపి నేత ఎంపీ కేసినేని నాని కూడా ఇప్పుడు విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యే అయినటువంటి బండారు సత్యనారాయణ (పెందుర్తి)మీద కూడా దాదాపు నాలుగు కేసులు దాకా ఉన్నాయి. అందులో మూడు తీవ్రమైన ఐపిసి సెక్షన్ల కింద నమోదు అయి ఉన్నాయి. మహిళపై లైంగిక దాడికి సంబంధించిన కేసు కూడా ఆయన మీద నమోదయింది మరొక టిడిపి ఎమ్మెల్యే పీలా గోవింద రాజులు (అనకాపల్లి అసెంబ్లీ) భూ కుంభకోణాల గురించి, ప్రభుత్వం భూ సమీకరణ చేసేటప్పుడు ఈయన పాల్పడ్డ అక్రమాల గురించి కూడా ఇలాంటి కేసులే ఉన్నాయి.ఇక మరొక మంత్రి గంటా శ్రీనివాసరావు భూ కుంభకోణాలకు గురించి, వాటి మీద జరిగిన ప్రత్యేక దర్యాప్తు ల గురించి వచ్చిన వార్తా కథనాలు అన్నీ ఒకచోట పేరిస్తే అది కూడా మరొక ఉద్గ్రంథమే అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నుంచి ఈయనకు క్లీన్ చిట్ ఉన్న మాట కూడా వాస్తవమే. ఇక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ( గురజాల అసెంబ్లీ) మీద మర్డర్ తదితర తీవ్రమైన ఐపిసి సెక్షన్ల కు సంబంధించిన సంబంధించిన కేసులు ఉన్నాయి. అక్రమ మైనింగ్ కి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. దీని మీద సిబిఐ దర్యాప్తు కూడా జరుగుతోంది. ఇక దేవినేని ఉమ (మైలవరం అసెంబ్లీ)మీద ఐపీసీ సెక్షన్ 509 సహా పలు కేసులు నమోదై ఉన్నాయి. ఐపీసీ సెక్షన్ 509 అనేది మహిళల మీద దాడికి సంబంధించిన కేసు. ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ మీద మహిళలపై దాడి చేసిన కేసు తో సహా దాదాపు 10 కేసులు నమోదై ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ నేతల మాదిరిగానే ఇది కూడా అసంపూర్ణమైన జాబితాయే.చింతమనేని ప్రభాకర్ తో గొడవ కేసులో ఏలూరు ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న రెడ్డి అప్పలనాయుడు మీద గతంలో కేసులు నమోదు ఐన్నప్పటికీ హైకోర్టు గతంలోనే ఆ కేసును కొట్టివేసింది. కొంతమంది బడా నేతలు జనసేన లో చేరడానికి ఆసక్తి చూపినప్పటికీ వారి మీద గతంలో ఉన్న కేసులు ఆరోపణల కారణంగా పవన్ కళ్యాణ్ వారిని పార్టీలోకి తీసుకోలేదు. గెలుపు ఓటమి లను పక్కన పెడితే, మొత్తం మీద, టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణ కానీ క్రిమినల్స్ కి టికెట్స్ ఇచ్చాడనే ఆరోపణ కానీ రాకుండా పవన్ కళ్యాణ్ టికెట్స్ ఇవ్వడం అభినందించదగ్గ విషయం 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26468
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author