తెలంగాణలో పది పార్లమెంట్ సీట్లు మావే..!

తెలంగాణలో పది పార్లమెంట్ సీట్లు మావే..!
April 05 16:11 2019

జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పది పార్లమెంట్ స్థానాలను గెలుస్తామని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి సలీం అహ్మద్  విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని సాయి రాజా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందు రెడ్డి, డిసిసి అధ్యక్షులు కొత్వాల్, వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నారెడ్డి, పాలమూరు కాంగ్రెస్ నేత సయ్యద్ ఇబ్రహీం, షాద్ నగర్ కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, పీసీసీ సభ్యులు బాబర్ ఖాన్, తదితరులు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సలీం అహమ్మద్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో లో టిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన హామీలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం సమయాన్ని దాటవేస్తూ వస్తుందని అన్నారు. దేశ ప్రజల్లో భారతీయ జనతా పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. తెలంగాణలో బిజెపి, టిఆర్ఎస్ తో అంతర్గతంగా దోస్తీ చేసిందని ఈ రెండు పార్టీలు ఒక్కటేనని దీనిని ప్రజలు గ్రహించాలని సూచించారు. అబద్ధపు వాగ్దానాలతో ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు  అనుకూలంగా పవనాలు వీస్తున్నాయని, ఖచ్చితంగా దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు.. కెసిఆర్ కు కర్రు కాల్చి వాత పెడతాంతెలంగాణ రాష్ట్రంలో  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వారి ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దిమ్మతిరిగే ప్రజా ఓట్ల ద్వారా కెసిఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పాలమూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి విమర్శించారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు మొదలయ్యాయని, ఉత్తర తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు దీనికి నిదర్శనమని అన్నారు. టిఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగిందని, భవిష్యత్తులో మరింత ప్రజా వ్యతిరేకత ఎదురవుతుందని అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని టిఆర్ఎస్ ను విమర్శించారు. టిఆర్ఎస్, బిజెపి రెండు పార్టీలు ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూస్తాయని అన్నారు. రాహుల్ గాంధీ పేదల ఖాతాల్లో నెలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి 72000 నగదు జమ చేస్తారని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, మైనార్టీ వర్గాలకు అండగా నిలబడతారని అన్నారు. నిస్వార్ధంగా రాజకీయాలు చేస్తున్న తనను ఈ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. పూటకొక్క పార్టీ మార్చే నాయకులను నమ్మొద్దని అన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే షాద్ నగర్ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఓ ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. షాద్ నగర్ నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తమకు కొండంత బలాన్ని అందించిందని అన్నారు. అదేవిధంగా పాలమూరు నియోజకవర్గంలో సయ్యద్ ఇబ్రహీం కాంగ్రెస్ పార్టీలో చేరడం అదేవిధంగా షాద్ నగర్, మహబూబ్నగర్ ఈ రెండు నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు పరిధిలో ఇబ్రహీంకు మంచి పట్టు ఉందని అది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని వంశీచంద్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో స్థానిక నేతలు బాలరాజ్ గౌడ్, పురుషుత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, దంగు శ్రీనివాస్ యాదవ్, వన్నాడ ప్రకాష్, అంచె రాములు, నల్లమోని శ్రీధర్, ఎస్పీ శివ, గంగమోని సత్తయ్య, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26493
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author