ఐదేళ్ల క్రింది చాయ్‌ వాలా.. ఇప్పుడు చౌకీదార్‌ అయ్యాడు

ఐదేళ్ల క్రింది చాయ్‌ వాలా.. ఇప్పుడు చౌకీదార్‌ అయ్యాడు
April 05 18:41 2019

ఐదేళ్ల కింద మోదీ చాయ్‌ వాలా.. ఇప్పుడు చౌకీదార్‌ అయ్యిండు. మోదీ వేషం మారింది కానీ దేశం మారలేదు. మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్‌ గాడి తప్పింది అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. నగరంలోని తాజ్‌ డెక్కన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.గత ఐదేళ్లలో ఈ పని చేశానని చెప్పుకునే స్థితిలో మోదీ లేడు. మోదీ ఏదో చేస్తాడన్న భ్రమ దేశ ప్రజలకు తొలగిపోయింది. మోదీ, రాహుల్‌ కలిసినా సంపూర్ణ మెజార్టీ రాదు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమైతే దేశంలో ఇంకా సమస్యలు ఎందుకున్నాయని కేటీఆర్‌ ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇవ్వడం లేదు. మిషన్‌ భగీరథ, కాకతీయకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ 16ఎంపీలు గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటుంది. ఢిల్లీలో 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉంటే కేంద్రం మెడలు వంచి మన హక్కులు సాధించుకోవచ్చు. ప్రాంతీయ పార్టీలకు ఇది మంచి అవకాశం. ప్రాంతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమని కేటీఆర్‌ చెప్పారు. నాకు ఓటేయ్యండి.. నేను కేంద్రమంత్రి అవుతానని కిషన్‌ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు. ఉన్న ఒక్క మంత్రినే తీసేసిన చరిత్ర బీజేపీది అని కేటీఆర్‌ గుర్తు చేశారు. రాజకీయ అవినీతికి చాలా వరకు అడ్డుకట్ట వేశాం. చంద్రబాబు పొద్దున లేస్తే సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ ఉల్టా తిడితే ఆంధ్రాలో నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని చంద్రబాబు భావిస్తున్నాడు అని కేటీఆర్‌ పేర్కొన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26497
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author