జగన్ క్యాబినెట్ వర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు

జగన్ క్యాబినెట్ వర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు
June 07 14:27 2019

జగన్ క్యాబినెట్ వర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు

భారతదేశ చరిత్రలోనే కొత్త ఒరవడి

అన్ని వర్గాల వారి ప్రాధాన్యతే లక్ష్యం

తాడేపల్లి: 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గంలో అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది. మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలి. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలి. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌ గురించి అడిగా. ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలి. ప్రతి కాంట్రాక్ట్‌ ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుంది. ఏడు రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల ప్రక్రియ ఉంటుంది. జ్యుడీషియల్‌ కమిషన్‌ సూచనల మేరకు ప్రతి టెండర్‌లో మార్పులు ఉంటాయి. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ చేడతాం. రివర్స్‌ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు. ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నాం. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్‌ పెరగాలి. నామినేషన్‌ పద్థదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పనులు కేటాయిస్తాం.’ అని తెలిపారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26531
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author