చందమామ అందిన రోజు….! నేటికి యాభయేళ్ళు!!

చందమామ అందిన రోజు….! నేటికి యాభయేళ్ళు!!
July 22 19:08 2019

చంద్రునిపై కాలు మోపిన తొలి మానవుడు నీల్ఆర్మ్ స్ట్రాంగ్

చంద్ర గ్రాహంపై మనిషి కాలు పెట్టి… 50 ఏళ్లు నిండాయి. అపోలో 11గా పిలిచి ఈ మిషన్ కోసం దాదాపు 4లక్షల మంది శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు పనిచేశారు.
చివరకు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకెల్ కొల్లిన్స్ మాత్రమే చంద్రునిపై అడుగు పెట్టేందుకు అనుమతి లభించింది. కోట్లాది మంది ఆశల్ని, ఆశయాల్నీ మోసుకెళ్తూ… ఆ ముగ్గురూ… జాబిల్లి చెంతకు చేరారు.
జులై 16, 1969న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచీ శాట్రన్ V రాకెట్… నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
చందమామ చుట్టూ తిరిగిన తర్వాత… ది ఈగిల్ అని పిలిచే మాడ్యూల్… చందమామ ఉపరితలం వైపు 13 నిమిషాలు ప్రయాణించింది. ఈ జర్నీలో రెండు కీలక సమస్యలు ఎదురయ్యాయి. మొదట… నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్‌కి భూమితో రేడియో కాంటాక్ట్స్ తెగిపోయాయి. ఆన్ బోర్డ్ కంప్యూటర్‌లో ఎర్రర్ మెసేజ్ కనిపించింది. రెండో సమస్య ఏంటంటే… ఇంధనం సరిపోని పరిస్థితి. అయినప్పటికీ మాడ్యూల్‌ని విజయవంతంగా చందమామపై ఉన్న పగులు లోయ
సీ ఆఫ్ ట్రాంక్విలిటీలో జులై 20న విజయవంతంగా దింపగలిగారు.
కమాండ్ మాడ్యూల్ పైలట్ అయిన మైకెల్ కొల్లిన్స్… మాడ్యూల్‌లోనే ఉండిపోగా… నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బుజ్ అల్డ్రిన్ మాత్రం చందమామపై దిగాలని నిర్ణయించారు. మాడ్యూల్ నుంచీ బయటకు వచ్చి… చందమామపై తొలి అడుగు పెట్టిన వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్.

తాను వేస్తున్న ఈ చిన్న అడుగు… మానవ జాతికి మహాజాడగా అభివర్ణించారు. ముగ్గురు వ్యోమగాములూ… జులై 25, 1969న భూమి మీదికి పున:ప్రవేశించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26565
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author