నాప్కిన్లు వాడకం పై మహిళల చైతన్యంలో మరో ముందడుగు

నాప్కిన్లు వాడకం పై మహిళల చైతన్యంలో మరో ముందడుగు
July 23 16:57 2019

నాప్కిన్లు వాడకం పై మహిళల చైతన్యంలో మరో ముందడుగు

హైదరాబాద్ నగరంలో
మహిళల కోసం ఉచితం గా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ యంత్రాలు

సేఫ్టీ ప్యాడ్ల వాడకం, వినియోగం పై మహిళలు న్యూనతా భావంతో కుంగి పోయే రోజులు పోతున్నాయ్.

ప్రతీ నెల వచ్చే నెలసరి సమస్య వల్ల మహిళలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య వలన కొందరు బయటికి వెళ్ళడానికి కూడా సంకోచిస్తారు. దీంతో హైదరాబాద్ నగరంలోని వెస్ట్‌జోన్ అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టారు. దీంట్లో భాగంగా మహిళల నెలసరి సమస్యలకు పరిష్కారం కోసం వెస్ట్ జోన్ పరిధిలో సానిటరీ నాప్‌కిన్స్ ఉచిత పంపిణీ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ జోన్ పరిధిలోని పలు చౌరస్తాల వద్ద సానిటరీ నాప్‌కిన్స్ మిషన్లను ఏర్పాటు చేసి ఉచితంగా అందించనున్నారు. దీన్ని అమలు చేసేందుకు రూ.2.5 లక్షల ఖర్చుతో వెస్ట్ జోన్ పరిధిలోని పలు చౌరస్తాల్లో మహిళల నాప్‌కిన్స్‌ను ఫ్రీగా అందించే మిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ సైతం పూర్తి కాగా త్వరలో మిషన్లు ఏర్పాటు కానున్నాయి. కాగా ఆ మూడు రోజులు వినియోగించుకున్న తరువాత వాటిని అవే మిషన్ల ద్వారా బూడిద చేసే వెసులుబాటు కూడా ఈ మిషన్లకు ఉంది

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26579
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author