ఏపీ గవర్నర్ కు స్వాగతం పలికింది సీఎం జగన్

ఏపీ గవర్నర్ కు స్వాగతం పలికింది సీఎం జగన్
July 24 16:22 2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ బీబీ హరిచందన్ కు ఘన స్వాగతం పలికారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిబీ హరిచందన్ కు విమానాశ్రయంలో స్వాగతం పలికారు సీఎం జగన్.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ తోపాటు మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, మోపిదేవి వెంకటరమణలు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ , 
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, సీపీ ద్వారకా తిరుమలరావు, పలువురు ఉన్నతాధికారులు సైతం గవర్నర్ కు స్వాగతం పలికారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26590
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author