అంతంత మాత్రంగా అంబేద్కర్ వర్శిటి అడ్మిషన్లు

అంతంత మాత్రంగా అంబేద్కర్ వర్శిటి అడ్మిషన్లు
October 10 14:42 2017

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటి అడ్మిషన్లకు ఏటా క్రేజ్ తగ్గుతోందా అంటే అవుననే అంటున్నారు విశ్వవిద్యాలయం అధికారులు. గత నాలుగేళ్ళుగా యూనివర్శిటీలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని చెప్తున్నారు. 2015 విద్యా సంవత్సరంలో లక్షా యాభై వేలమంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. అదే 2016 అకడమిక్ ఇయర్ కు వచ్చే సరికి వారి సంఖ్య లక్షా పది వేలకు చేరింది. ఇక 2017 సంవత్సరంలో అయితే లక్ష మంది  లోపే వివిధ కోర్సుల్లో చేరారు. తాజాగా 2017-18  అకడమిక్ ఇయర్ కు ప్రస్తుతం అడ్మిషన్లుజరిగాయి..అయితే ఇందులో అరవై వేలమంది మాత్రమే రావడంతో ఆందోళన పడ్డ అధికారులు స్పాట్ అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ఏపి తెలంగాణ రెండురాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటి క్రింద రెండువందల పదహారు సెంటర్లున్నాయి. వందలాది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే విద్యార్థులు ఏటా తగ్గుతుండటంతో యూనివర్శిటి మనుగడ పై ప్రభావం పడుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్రంలో ఉస్మానియా, తెలుగు యూనివర్శిటి, ఆంధ్ర, ఎస్వీయూ, నాగార్జున లాంటి విశ్వ విద్యాలయాలు కూడా డిస్టెన్స్ కోర్సులు రన్ చేస్తుండటంతో ఎక్కడ విద్యార్థులు అక్కడే జాయిన్ అవుతున్నారు. దీంతో అంబేద్కర్ యూనివర్శిటి అడ్మిషన్ల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందరికి ఉన్నత విద్యను అందించడం కోసం ప్రభుత్వాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీని ఏర్పాటు చేశాయి. అయితే యూనివర్శిటీలకు ప్రభుత్వం సరిగా నిధులు మంజూరు చేయక పోవడంతో అన్ని విశ్వ విద్యాలయాలు ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టి సారించి డిస్టెన్స్ మోడ్ లో కోర్సులు ప్రారంభించి వ్యాపారం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఒరిజినల్ ఓపెన్ యూనివర్శిటి ఈ పోటీలో నిలబడలేక పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే యూనివర్శిటి మనుగడకే ప్రమాదమొచ్చే అవకాశముందని యూనివర్శిటి వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2692
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author