భద్రాద్రిలో లడ్డూ మరింత ప్రియం

భద్రాద్రిలో లడ్డూ మరింత ప్రియం
October 10 15:00 2017
భద్రాద్రి రామాలయంలో లడ్డుప్రసాదం ధర పెరగడంపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. యాదగిరి గుట్ట దేవాలయంలో 100 గ్రాముల లడ్డు ప్రసాదం రూ.15, 400 గ్రాముల కళ్యాణం లడ్డు రూ.60. ఇక భద్రాచలం లో 100 గ్రాముల లడ్డు ప్రసాదం రూ.20, 500 గ్రాముల లడ్డు రూ .100. దీంతో భక్తులను నిలువు దోపిడీ చేసేందుకే ఆలయాల్లో ప్రసాదాల రేటు పెంచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే యాదగిరి గుట్ట దేవాలయాన్ని గొప్ప దేవాలయం గా చేస్తున్నామని ముఖ్యమంతి కెసిఆర్ చెప్పిన నేపధ్యం లో నాణ్యమైన ప్రసాదాలను సరసమైన ధరలకు గుట్ట దేవాలయం అందిస్తున్నది. రెండు దేవాలయాలు ఒక రాష్ట్రం లోనే ఉన్నాయి. మరి ధరల్లో ఈ వ్యత్యాసం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. లడ్డు ధర పెంపు కాంట్రాక్టర్ కు లాభాలు చేకూర్చే నిర్ణయమే కాని భక్తులకు కాదని మండి పడుతున్నారు.
పర్వదినాల్లో రామాయలయానికి భక్తులు అశేషంగా తరలివస్తారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మిగతా రోజుల్లో రద్దీ తగ్గుతుంది. దీనికి తోడు అధికారుల అనాలోచిత నిర్ణయాలు భక్తులకు భారంగా మారుతున్నాయి. ప్రతి రోజు జరిగే పూజా కైంర్యాలను భక్తులకు తెలిసేలా ప్రచారం చేయడంలో వైఫల్యం చెందడంతోనే ముక్కోటి, శ్రీరామనవమి రోజులు మాత్రమే భద్రాచలం కళకళలాడుతుంది. మిగతా రోజులు వెలవెలబోతోందన్నది స్థానికుల ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి బాటలు వేస్తున్న నేపథ్యంలో ఆధికారులు తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేయాలని అంతా కోరుతున్నారు. భద్రాద్రి వచ్చే భక్తులపై భారం పడకుండా భక్తి భావంతో తృప్తి చెందేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2696
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author