ఏపీకి “రారండోయ్… ఎంజాయ్ చేద్దాం”

ఏపీకి “రారండోయ్… ఎంజాయ్ చేద్దాం”
October 10 15:29 2017
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు టూరిజంతో పోటీ పడే స్థాయికి చేరుకుంది. ఎకో టూరిజం డెవలప్మెంట్  అటవీ ప్రాంతంలో పర్యాటకుల కోసం ప్రాజెక్ట్ సిద్ధం చేసింది. వచ్చే టూరిస్ట్ సెషన్ కి మరింత మంది పర్యాటకులను రప్పించాలని అనుకుంటోంది. అటవీ ప్రాంతం అందాలను ఆస్వాదించాలనుకునే క్రాంక్రీట్ జంగిల్ వాసులకు  అటవీ శాఖ ఎకో టూరిజం ప్రాజెక్ట్  రూపొందించేలా చేసింది. పర్యాటకానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని అటవీ శాఖ అభివృద్ధి చేసి అధునాతన సౌకర్యాలతో రూప కల్పన చేసింది. దీని కోసం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారేడుమెల్లి, రంప చోడవరం ఏరియాస్ లో వనవిహారి పేరిట టూరిజాన్ని అభివృద్ధి చేసింది.  అటవీ  ప్రాంతంలో పర్యాటకులు ఉండడానికి లగ్జరీ ఎసి  రూమ్స్, బ్యాంబు హౌసెస్, ట్రీ హౌసెస్ తో పాటు మంచి హోటల్స్ ను ఏర్పాటు చేశారు. పర్యాటకుల కోసం అటవీ ప్రాంతం లో పేరు పొందిన బ్యాంబు చికెన్   వంటి వంటలను కూడా అందిస్తున్నారు.  విజయ దశమి నుంచి సంక్రాంతి పండుగ మధ్య ఎక్కువ సంఖ్య లో పర్యాటకులు టూర్స్ కు వస్తున్నారు. దీంతో  కర్నూలు జిల్లాలో ఊడా ఎకో టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం  కర్నూల్ కు 60 కిలోమీటర్ల దూరంలోని నల్లమల ఫారెస్ట్ లో ఎకో పార్క్ ను  ఏర్పాటు చేశారు. ఇక్కడ పగలే పర్యాటకులకు అడవిలో రాత్రి సమయంలో ఉండే అనుభూతిని  అందిస్తున్నారు. అదే విధంగా విశాఖపట్నం నగరం లోని కంబలకొండ ఎకో టూరిజం పార్క్ సిద్ధం చేసి ఇక్కడే ప్రర్యాటకులు ఉండడానికి సౌకర్యాలను రూప కల్పన చేస్తోంది అటవీశాఖ. బయట హోటల్స్ తో పోల్చుకుంటే తక్కువ ధరకే ఎన్నో సౌకర్యాలను అందిస్తోంది .ఈ విధంగా అటు పర్యాటకులను ఆకర్షించడంతో పాటు అటవీశాఖ కు ఆదాయం వస్తోంది. వీటన్నింటికంటే ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించేందుకు ఇదెంతో దోహదం చేస్తుందని అటవీశాఖ అభిప్రాయపడుతోంది.  ఎకో టూరిజం ప్రాజెక్ట్ వల్ల అటవీసంపద కాపాడటంతో పాటు ప్రజలను ప్రకృతికి దగ్గర చేస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2702
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author