అక్కడా… మన తెలుగు వారే !

October 10 16:21 2017
మనం పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడ మనల్ని ఎవరైనా ‘బాగున్నావా’ అని అచ్చ తెలుగులో అడిగితే మనం ఉబ్బితబ్బిబ్బైపోతాం. అబ్బా ఇక్కడ కూడా మన తెలుగువారు ఉన్నారే అని ఆనందపడిపోతాం. ఇప్పుడు కొత్తగా ఎవరు అమెరికా వెళ్లినా ఇదే ఫీలింగ్ కలుగుతోంది. అమెరికాలోని ఏ నగర వీధుల్లో తిరిగినా తెలుగువారు ఎదురుపడతారు. ‘బాగున్నావా’ అంటూ పలకరిస్తారు. ఇది మన భాష మీద మక్కువతో ఊరకనే చెబుతున్నది కాదు. ఓ సర్వేలో వెల్లడైన నిజం. 2016 సంవత్సరానికి గాను అమెరికన్ కమ్యూనిటీ సర్వే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషల్లో తెలుగు మూడో స్థానంలో నిలిచింది.ఈ జాబితాలో హిందీ అగ్రస్థానంలో, గుజరాత్ రెండో స్థానంలో నిలిచాయి. బెంగాలీ, తమిళం‌ను వెనక్కి నెట్టి తెలుగు మూడో స్థానాన్ని ఆక్రమించింది. అంటే బెంగాలీ, తమిళం మాట్లాడేవారి కన్నా తెలుగు మాట్లాడే వారే అమెరికాలో ఎక్కవ మంది ఉన్నారు. యూఎస్‌లో ఐదేళ్లు అంతకు మించి వయస్సున్న 3,65,566 మంది వారి ఇళ్లలో తెలుగు మాట్లాడుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. అమెరికా జనాభాలో ఇది 0.12 శాతమని పేర్కొంది. వాస్తవానికి 4,24,482 మందితో ఉర్దూ రెండో స్థానంలో నిలిచినప్పటికీ వీరిలో పాకిస్థానీలు కూడా ఉన్నారు. దీంతో ఉర్దూను పక్కనబెట్టి మిగిలిన భారతీయ భాషలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు.మొత్తంగా చూస్తే అమెరికాలో అత్యధికంగా మాట్లాడుతున్న భాషల్లో తెలుగు 20వ స్థానంలో నిలిచింది. ఉర్దూతో సహా భారతీయ భాషలు మాట్లాడుతున్న వారి సంఖ్య 35,51,455 కాగా వీరిలో తెలుగు మాట్లాడేవారు 3,65,566 మంది కావడం విశేషం. ఈ సర్వేపై అమెరికాలోని చాలా మంది తెలుగు ప్రజలు పెదవి విరుస్తున్నారు. లెక్కల్లో ఉన్నవారి కంటే ఎక్కువ మంది తెలుగువారు అమెరికాలో నివసిస్తున్నారని అంటున్నారు.‘సంవత్సరానికి 80వేల హెచ్1బి వీసాలు ఇస్తున్నారు. 2001 నుంచి చూసుకుంటే 50 శాతం కంటే ఎక్కవ వీసాలను తెలుగు ప్రజలకే ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే కుటుంబ సభ్యులతో కలుపుకుని యూఎస్‌లో ఉన్న తెలుగువారి సంఖ్య సుమారు 10 లక్షలు ఉంటుంది’ అని ఫిలడెల్ఫియాకు చెందిన కె.హారిక వివరించారు. ఏటా అమెరికాకి వచ్చే తెలుగు వాళ్ల సంఖ్య పెరుగుతోందని, జనాభా లెక్కల్లో చూపించిన సంఖ్య చాలా తక్కువని అంటున్నారు. నివేదిక వెల్లడిస్తున్న లెక్కల్లో తప్పులున్నాయని చాలా మంది తెలుగు వారు అభిప్రాయపడుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2725
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author