‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ప్రకాష్ రాజ్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ప్రకాష్ రాజ్
October 11 08:54 2017
విశ్వవిఖ్యాత, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, రాజకీయ నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రారంభించనున్నట్లు.. చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు వర్మ మంగళవారం ప్రకటించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరవాత జరిగిన పరిణామాలపై మాత్రమే ఈ సినిమా ఉంటుందని వర్మ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారు..? అని ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రకాష్ రాజ్ అనే సరికి ఆ సినిమాకు కచ్చితంగా హైప్ క్రియేట్ అవుతుంది. తన నటనతో ఎన్టీఆర్ పాత్రకు పూర్తి న్యాయం చేయగలరు ప్రకాష్ రాజ్. కానీ అభిమానులు మాత్రం ప్రకాష్ రాజ్‌ను ఎన్టీఆర్ పాత్రలో ఊహించుకోలేకపోతున్నారట.వీరప్పన్, వంగవీటి సినిమాల్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని ఆర్టిస్టులను తీసుకొచ్చి వారిని వర్మ తెరపై అద్భుతంగా చూపించిన తీరుని ప్రతి ఒక్కరూ అభినందించారు. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రలో కూడా అటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్మ మాత్రం ప్రకాష్ రాజ్ అంగీకరిస్తే ఆయనను ఫైనల్ చేయాలని అనుకుంటున్నాడట. లేదంటే బాలీవుడ్ నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి సినిమా చేయాలని చూస్తున్నాడు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2766
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author