పాదయాత్రలతో పొలిటికల్ వార్

పాదయాత్రలతో పొలిటికల్ వార్
October 11 12:51 2017

జగన్మోహనరెడ్డి వచ్చే నెల2 నుంచి పాదయాత్ర చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు అనుమతినివ్వాలని హైకోర్టును కోరింది. సీబీఐ కోర్టుకు విన్నవించాలని.. అక్కడ కాదంటేనే తమ వద్దకు రావాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో జగన్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆరు నెలల పాటు ప్రజల వద్దకు వెళ్లేందుకు చేయనున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని… ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలనే నిబంధనను తాత్కాలికంగా పక్కన పెట్టాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. జగన్ పిటీషన్ పై నిర్ణయం తీసుకోనుంది కోర్టు. కొన్ని నిబంధనలతో అనుమతి ఇస్తుందా లేక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిందేనని చెబుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు జగన్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దలతోను మంతనాలు చేశారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ ఎంపీ నేత ఇంట్లో రహస్యంగా భేటీ కావడం వెనుక కారణం ఇదేనంటున్నారు. విషయం ఏదైనా ఇప్పుడు జగన్ కు జనసేన అధినేత పవన్ పోటీకి వచ్చారు. తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారాయన. అనంతపురంలో జరిగిన ఏపీకి ప్రత్యేక హోదా సభలోనే ఈ సంగతి ప్రకటించారు. అనంతపురం నుంచే తాను పోటీ చేస్తానని చెప్పారు. ఈ నేపధ్యంలో ఇటు జగన్, అటు పవన్ లు పోటా పోటీగా ప్రజల్లోకి వెళ్లే ఆలోచన చేయడం ఆసక్తికరమే. ముందుగా పార్టీ నేతలను ఎంపిక చేసే పని చేస్తున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. జిల్లాల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన ఆయన జన సైనికుల ఎంపిక చేస్తున్నారు. జనసేన జనంలోకి వెళ్లేందుకు పవన్ కార్యాచరణ ప్రకటించనున్నారు. అదే జరిగితే ఇక రాజకీయ కాక మరింత పెరుగుతుందన్నది వాస్తవం.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2790
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author