ఆ నాలుగు రాశుల అబ్బాయిలంటే…  వాళ్లకు పిచ్చి

ఆ నాలుగు రాశుల అబ్బాయిలంటే…  వాళ్లకు పిచ్చి
October 11 13:22 2017
 వ్యక్తి యొక్క లక్షణాలు, స్వభావం, ఇష్టాఇష్టాలు, భవిష్యత్తు, ప్రేమ, వృత్తి, సంబంధాలు, సంపద మొదలైనవి జ్యోతిషం ద్వారా అంచనా వేస్తారు. వివాహ సమయంలో స్త్రీ, పురుషుల జన్మ నక్షత్రాలను బట్టి వారికి సరైన జోడిని పెద్దలు ఎంపిక చేస్తారు. అయితే నాలుగు రాశులకు చెందిన మగవాళ్లు మాత్రం మహిళలను సులభంగా ఆకర్షిస్తారు.మిథునరాశికి చెందిన పురుషులు ఈ విషయంలో చాలా అదృష్ట‌వంతులు. వీళ్లు పెద్దగా శ్రమించకుండానే మహిళలను ఇట్టే ఆకట్టుకుంటారు. మృదు స్వభావులు కావడంతో అమ్మాయిలు తొందరగా స్నేహం చేస్తారు. ఈ రాశికి చెందిన పురుషులకు మహిళలతో ఎలా మాట్లాడాలో తెలుసు. అమ్మాయిల హృదయాన్ని అర్థం చేసుకునే సామర్ధ్యం ఎక్కువ. అందువల్ల, ఈ రాశివారిని స్త్రీలు అమితంగా ఇష్టపడతారు.సింహ రాశికి చెందిన వాళ్లు బలమైన సంబంధాలు కోరుకుంటారు. విశాలమైన హృదయం వీరి సొంతం. రొమాంటిక్‌గా ఉంటారు. కానీ అమ్మాయిలను పరిహసించడానికి సిగ్గుపడతారు. అయితే వీరిలో కొందరు సున్నిత మనస్తత్వం కలిగినవారు ఉంటారు. స్నేహపూర్వకంగా ఉంటారు. అందుకే వీరిని ఎక్కువగా ఇష్టపడతారు.తొలిచూపులోనే ఏ అమ్మాయినైనా ఆకర్షించే సామర్థ్యాన్ని ఉంటుంది. ఉద్వేగభరితంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలే అమ్మాయిల హృదయాలను గెలుచుకుంటాయి.
తుల రాశి వారి సామర్థ్యం కళ్లలోనే ఉంటుంది. తక్కువ సమయంలో అందమైన అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారు. వీరి శైలి ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ప్రేమ విషయంలో లోతైన స్వభావం కలిగి ఉంటారు. ప్రేమ, బాధ్యతల మధ్య సమతూకం పాటిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందడుగేస్తారు. పిరికితనం, స్వీయ-విధ్వంసక స్వభావం కలిగి ఉన్నప్పటికీ, ఒక అమ్మాయితో కొంత సమయం మాట్లాడితే, ఆమెను తన స్నేహితురాలిగా అంగీకరిస్తారు.  మకర రాశికి చెందిన అబ్బాయిలను చూడగానే ఆకట్టుకునేలా ఉంటారు. వారి మాటతీరు, విధానం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. దీంతో అమ్మాయిలు తొందరగా ఆకర్షితులవుతారు. వీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. మనోహరమైన వీరి వ్యక్తిత్వం స్త్రీలను ఇట్టే ఆకర్షిస్తుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2812
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author