రాజధాని అభివృద్ధితో పాటే రైతుల వృద్ధి :చంద్రబాబు

రాజధాని అభివృద్ధితో పాటే రైతుల వృద్ధి :చంద్రబాబు
October 11 23:42 2017
రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న తన ఆలోచనను సాకారం చేయడానికి అవసరమైన కార్యప్రణాళికను వచ్చే సమావేశానికల్లా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు 123 మంది రాజధాని ప్రాంత రైతులను సింగపూర్ తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనకు బుధవారం జరిగిన 12వ సీఆర్డీఏ ప్రాధికార సమావేశంలో ఆయన ఆమోదం తెలిపారు.
‘రాజధాని గ్రామాలలో ఉన్న రైతులు అమరావతికి అసలు పౌరులు. వారి ఉన్నతికి దోహదపడే కృషిని తక్షణం చేపట్టాలి’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే తొలుత వారిని సింగపూర్ పంపిస్తున్నామని చెప్పారు. సింగపూర్లో ఉన్న ఉత్తమ అభ్యాసాలు, అవకాశాలపై అవగాహన పెంచి వ్యాపార, వాణిజ్య రంగాల్లో వారిని ప్రావీణ్యులను చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు.
సింగపూర్ తీసుకువెళ్లేందుకు జరిపిన ఎంపిక ప్రక్రియలో మొత్తం 123 మంది రైతులు అర్హత సాధించగా, లాటరీ తీసి అందులో వందమందిని ఎంపిక చేశామని సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. మిగిలిన ఆ 23 మంది రైతులను నిరుత్సాహ పర్చకుండా వారిని కూడా సింగపూర్ తీసుకువెళ్లాలన్న ప్రతిపాదనతో మరో రూ. 12 లక్షల అదనపు బడ్జెట్ కేటాయింపు అంశాన్ని సమావేశం ఎజెండాలో చేర్చగా, ముఖ్యమంత్రి దానికి వెంటనే ఆమోదం తెలిపారు. ‘రాజధాని గ్రామాల్లోని రైతులు కష్టజీవులు. మూడేళ్ల క్రితం వరకు వారంతా వ్యవసాయాన్నే నమ్ముకుని జీవించారు. నా మాట విని నమ్మి విలువైన భూములను ప్రభుత్వానికి అందించారు. వారంతా సంతోషంగా ఉండేలా చూడాలి. సంతృప్తిగా జీవించాలి. వారందరినీ పారిశ్రామికవేత్తలుగా మార్చాలి. అందుకు గల అన్ని అవకాశాలనూ వారికి అందుబాటులో తీసుకురావాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు.
‘ఫార్మర్స్ ఫస్ట్’ అనే భావనతో ఈ యాత్ర తలపెట్టామని సీఆర్డీఏ కమిషనర్ చెప్పగా, ‘సాధికారత దిశగా రాజధాని రైతు’ చేపట్టే యాత్రగా మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. రాజధాని రైతులు వ్యవసాయం నుంచి వాణిజ్య, పారిశ్రామికరంగం వైపు మరలే ప్రక్రియ వీలైనంత వేగంగా, సరళంగా జరిగిపోవాలని చెప్పారు. అమరావతి గ్రామాల్లోని 32 వేల కుటుంబాలు ఆర్థికంగా బలపడేలా, సమున్నతంగా ఎదిగేలా నిర్ణిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఆర్డీఏకు సూచించారు.
‘రాజధాని అభివృద్ధికి సమాంతరంగా రాజధాని రైతుల అభివృద్ధి కూడా జరగాలి. దీనిపై రానున్న సమావేశంలో నిర్ధిష్ట ప్రతిపాదనలతో రావాలి’ అని ఆదేశించారు. రాజధాని గ్రామాల్లోని వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికుల సమగ్ర వివరాలను సేకరించాలని చెప్పారు. ప్రతి ఒక్కరి విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులపై తాజా సమాచారం తీసుకోవాలన్నారు. వారిని చిన్నచిన్న బృందాలుగా ఏర్పరచి నైపుణ్య శిక్షణ, వ్యాపార అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుపై సరైన అవగాహన కల్పించాలని, ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకన్జీకి ఈ బాధ్యతలు అప్పగించి తగిన ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.
ప్రజల ఆలోచన విధానాన్ని మార్చేలా బావి ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తూ అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పేదరికం నుండి బయటకు రావాలంటే ఆ వ్యక్తి ఆ కుటుంబం కష్టపడిన అప్పటికే పేదరికం నుండి బయటకు వస్తుందని పేర్కొంటూ ఎవరికివారు బాధ్యతలు లేకుండా ప్రవహించినప్పుడు ముందుకు వెళ్లడం కష్టం సాధ్యమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు ఒక వ్యక్తి గా అందరూ బాధ్యతగా ఉంటామని స్వీయ ప్రతిజ్ఞ తీసుకుని వేడుకలతో పాటు బాధ్యతలను గుర్తెరిగి ముందుకు వెళ్లటానికి నిర్ణయించు కోవాలని కలెక్టర్ కోరారు.
ఈ వేడుకలలో సంగారెడ్డి జహీరాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ బొగ్గుల విజయలక్ష్మి, షబానా తస్లీమ్,  సీడీసీ చైర్మన్ విజయేంద్ర రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్ రెడ్డి,  జిల్లా ప్రాదేశిక సభ్యులు,  వివిధ శాఖల జిల్లా అధికారులు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2962
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author