ఆ అంశం మోడీకి తలనొప్పే

ఆ అంశం మోడీకి తలనొప్పే
October 12 12:26 2017
బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు అజయ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుదిబండగా మారుతోంది. అజయ్ షాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్, వామపక్షలతోపాటు అన్ని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. దీంతో తన ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నదని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు తెలిసింది. వెబ్ వార్తా సంస్థ ‘ద వైర్’ మూడు రోజుల క్రితం అజయ్ షా అవినీతికి సంబంధించిన ఒక వార్తను ప్రసారం చేసింది. ఈ వార్త రాగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తదితరులు మోదీపై దాడికి దిగారు. 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత తన వ్యాపారం పెద్దఎత్తున పెరిగిందంటూ వార్తను ప్రసారం చేసిన ఆ వార్తా సంస్థపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని అజయ షా ప్రకటించారు. నరేంద్ర మోదీని దెబ్బతీసే కుట్రలో భాగంగానే కొందరు అమిత్ షా కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేయించారని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ దుయ్యబట్టారు. అయితే అజయ్ షా పరువు నష్టం దావా హెచ్చరిక, ఎన్‌డిఏ మంత్రుల విమర్శలు ప్రతిపక్షం దాడిని ఆపలేకపోతున్నాయి. అమిత్ షాపై దాడి కొనసాగించటం ద్వారా నరేంద్ర మోదీని దెబ్బతీయాలన్నది ప్రతిపక్షం వ్యూహంగా కనిపిస్తోంది. ఇదిలావుంటే జయ్ షాపై వచ్చిన ఆరోపణలను సమర్థంగా తప్పికొట్టటం లేదని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. జయ్ షా వెబ్ వార్తా సంస్థపై పరువునష్టం దావా వేయగానే ప్రతిపక్షాలపై పెద్దఎత్తున దాడి చేయాలని బిజెపి ఆలోచిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దృష్టి కేంద్రీకరించాలని అమిత్ షా సీనియర్ మంత్రులకు సూచించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2986
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author