సమంతకు డైమండ్ రింగ్ ప్రెజంట్ చేసిన పవన్

సమంతకు డైమండ్ రింగ్ ప్రెజంట్ చేసిన పవన్
October 12 17:04 2017
వారం రోజులుగా ఎక్కడ చూసినా సమంత, నాగచైతన్య పెళ్లి గురించిన వార్తలే. కుటుంబ సభ్యులు, సన్నిహతుల మధ్య వీరిద్దరూ అక్టోబర్ 6న గోవాలో పెళ్లాడారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహమైంది. పెళ్లి కానుకగా సామ్-చై దంపతులకు పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ ఊహించని రీతిలో గిఫ్ట్‌ను పంపారట. కొత్త జంట కోసం రెండు డైమండ్ రింగ్‌లను వీరు బహుమతిగా పంపించారట. ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్లో పాల్గొని కొత్త జంటకు ఉంగరాలు ఇవ్వాలని పవన్, త్రివిక్రమ్ ముందుగా భావించారట. కానీ ప్లాన్ మార్చుకొని పెళ్లి సమయంలో నూతన దంపతులకు ఈ గిఫ్ట్‌ను పంపి సర్‌ప్రైజ్ చేశారట. అయితే ఈ వార్తల పట్ల అటు చైతూ సమంతలు గానీ, ఇటు పవన్, త్రివిక్రమ్ గానీ స్పందించలేదు. పవర్ స్టార్ సరసన సమంత ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3102
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author