లంచం అడిగితే అంతే..!

October 13 18:26 2017
లంచాల పేరుతో ప్రజలను పీక్కుతినే అధికారులకు కాలం చెల్లింది. అక్రమార్కుల పాలిట యమపాశాన్ని సర్కారు రెడీ చేస్తోంది.  ప్రజలు సమర్పించే ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్న ప్రభుత్వ సిటిజన్‌ చార్టర్‌ ప్రకారం పనులు చేయని అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విధుల్లో అలక్ష్యం, అవినీతికి పాల్పడినవారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయనుంది.
రాష్ట్రంలో రెడ్‌ టేపిజాన్ని నిరోధించి .. సిటిజన్‌ చార్టర్‌ను పక్కాగా అమలు చేసేందుకు వీలుగా, రాష్ట్ర పారదర్శక, సమర్థవంత, సమయపాలనా పౌర సేవా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి దాకా పౌరసేవా విధానం అమలులో ఉన్నా, అమలు చేయనివారిపై శాఖాపరంగా ఎలాంటి చర్యలూ తీసుకునే అవకాశం లేదు. కచ్చితమైన చట్టం లేకుండా సిటిజన్‌ చార్టర్‌ అమలు సాధ్యం కాదని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర పారదర్శక, సమర్థవంత, సమయపాలనా పౌర సేవా బిల్లుని సిద్ధం చేసింది.
ఈ బిల్లును వచ్చే శాసనసభా సమావేశాల్లో ప్రవేశ పెడతారు. ఈ బల్లు చట్టమైతే, సిటిజన్‌ చార్టర్‌ ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలో అర్జీలను పరిష్కరించాల్సిందే! లేదంటే తొలివిడతగా .. సంబంధిత ఉద్యోగి నుంచి అపరాధ రుసుము వసూలుచేస్తారు. అప్పటికీ దారిలోకి రాకపోతే, శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. చట్టం పరిధిలోకి స్థానిక సంస్థలతో సహా 65 ప్రభుత్వ విభాగాలు వస్తాయి. జిల్లా కలెక్టరు అధ్యక్షతన ఒక కమిటీని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ప్రతి వారమూ నిర్వహించే గ్రీవియెన్స్‌ సెల్‌లో పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి.. తదానుగుణంగా ఉద్యోగులపై చర్యలకు నివేదిస్తుంది.
రాష్ట్రంలో స్థానిక సంస్థలు సహా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనిని ఎంత కాలంలో పూర్తి చేయాలనేది సిటిజన్‌ చార్టర్‌ ఖరారు చేస్తుంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని నోటీసు బోర్డులో దీనిని వేలాడదీస్తారు. అయితే, అది బయట నోటీసు బోర్డులకే పరిమితం. లోపల కార్యాలయంలో ఎక్కడా చార్టర్‌ అమలు కనిపించదు. లంచమిస్తే తప్ప ఫైలు ముందుకు జరపనివారే ఎక్కువ. ఇక.. మరికొందరు ఉంటారు. వారు నిజాయితీ పేరిట, తమ వద్దకు వచ్చిన ఫైళ్లకు కొర్రీల మీద కొర్రీలు వేస్తుంటారు. ఒక నిర్ణయం తీసుకోడానికి సుదీర్ఘకాలం నాన్చుతూ ఉంటారు. అటు అవినీతి ఉద్యోగులతో, ఇటు నాన్చుడు సిబ్బందితో, ఏ పనీ సకాలంలో జరగక ప్రభుత్వం తల పట్టుకొంటున్న సందర్భాలే ఎక్కువ.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3227
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author