మా పెళ్లి తప్ప ఇంకేమి ఉండవా?

మా పెళ్లి తప్ప ఇంకేమి ఉండవా?
October 14 15:06 2017
ఇండస్ట్రీలో ఇంకో టాపిక్కే లేనట్టుగా సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి, నా పెళ్లి గురించే అడుగుతారెందుకు ? కొత్తగా, ఆసక్తికరంగా వుండేవి ఇంకేమైనా అడగొచ్చు కదా అని మీడియా మీద ఆగ్రహం వ్యక్తంచేసింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు. అవును, ఆమె నటించిన అప్‌కమింగ్ మూవీ గోల్‌మాల్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న టబుని అక్కడున్న మీడియా పెళ్లి గురించి ప్రశ్నించింది. మీడియా నుంచి పెళ్లి గురించి ప్రశ్న వినడంతోనే టబుకి ఎక్కడా లేని కోపం తన్నుకొచ్చిందిఎప్పుడు, ఎక్కడికెళ్లినా ఇంకో టాపిక్కే లేనట్టుగా ఎప్పుడు చూడు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి, నా పెళ్లి గురించే అడుగుతారు ఎందుకు ? పదే పదే ఈ పెళ్లి ప్రశ్న వింటుంటే చాలా చిరాగ్గా వుంది అని మీడియాపై చిందులేసిందట టబు. ఇటీవలే గోవాలో ఓ బీచ్ ఒడ్డున విల్లా కొనుక్కుని అందులోనే లైఫ్‌ని జాలీగా గడిపేస్తోన్న టబు.. తన పెళ్లి గురించి ఆగ్రహిస్తే తప్పు లేదేమో కానీ సల్మాన్ ఖాన్ పెళ్లిని కూడా ఇందులో లాగి అతడి పెళ్లిని కూడా వార్తల్లోకి తీసుకొచ్చింది. మరి దీనిపై సల్లూ భాయ్ ఏమని స్పందిస్తాడో మరి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3328
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author