వజ్ర బస్సులతో దోచేస్తున్నారు..!

వజ్ర బస్సులతో దోచేస్తున్నారు..!
October 14 19:20 2017
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల కొత్తగా ప్రవేశ పెట్టిన ‘వజ్ర’ మినీ ఏసీ బస్సుల సేవలు నీరుగారుతున్నాయి. కరీంనగర్‌లో ఎంపిక చేసిన ప్రదేశాలు రాంనగర్, జ్యోతినగర్, మంకమ్మతోట తదితర ప్రాంతాల ప్రజల ముంగిటకే వజ్ర బస్సు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్,కూకట్‌పల్లికి చేరవేయాలి. కానీ డ్రైవర్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఆర్టీసికి చెడ్డపేరు తీసుకువస్తున్నారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ నుంచి బయల్దేరిన వజ్ర మినీ ఏ/సీ బస్సులో ఘట్‌కేసర్ (పోచారం)లోని ఇన్ఫోసిస్‌కు చెందిన కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇతర ప్రయాణికులు ఉదయం 6.30 గంటలకు ఉప్పల్ రింగ్ రోడ్డులో వజ్ర బస్సులో ఎక్కారు. ఒక్కొరికి టికెట్టు రూ. 310లు. వీరు కరీంనగర్‌లోని మంకమ్మతోట, రాంనగర్ ప్రాంతాల్లో దిగేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ హైదరాబాద్‌కు చెందిన వజ్ర బస్సు డ్రైవర్ తనకు మంకమ్మతోట, రాంనగర్‌కు రూట్ తెలువదంటూ సుమారు పది మంది ప్రయాణికులను బలవంతంగా కరీంనగర్ ఆర్టీసీ బస్సు స్టేషన్‌లోనే దింపివేశాడు. తాము రూట్ చెబుతామని చెప్పినా కూడా వినకుండా బస్ స్టాండ్‌లో దించివేయడంతో వారు తాము వెళ్లాల్సిన ప్రాంతాలకు అదనంగా డబ్బులు చెల్లించి ఆటోల్లో వెళ్లారు.ఆన్‌లైన్‌లో టికెట్టు బుక్ చేసుకొని కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన తమను అర్ధాంతరంగా బస్ స్టేషన్‌లో దించివేయడంపై ఆందోళన కొనసాగుతోంది. సూపర్ లగ్జరికి రూ. 195: కరీంనగర్ నుంచి జూబ్లి బస్ స్టేషన్ (సికింద్రా బాద్)కు సూపర్ లగ్జరీలో ప్రయాణం చేయాలంటే రూ.195 చార్జి తీసు కుంటున్నారు. జూబ్లి నుంచి ఉప్పల్‌కు డిపో బస్సు (యాదగిరి గుట్ట వెళ్లే బస్సు)లో వెళితే రూ.11, సిటీ బస్సులో వెళితే రూ. 18 చార్జి ఉంటుంది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు సిటి బస్సులో వెళితే రూ. 18 టికెట్ చెల్లించాలి. మొత్తంగా జూబ్లి బస్‌స్టేషన్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు రూ. 40 ఖర్చు అవుతుంది. కరీంనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు రూ. 195+40 అంటే రూ. 235 మాత్రమే అవుతుంది. వజ్ర బస్సు మీ నివాసం సమీపానికే వచ్చి మిమ్మల్ని తీసుకొని చేరాల్సిన గమ్యస్థానంలో దించుతుంది. ఇందుకు రూ.310 చార్జి. సేవలు గొప్పగా ఉంటాయని ప్రచారం చేస్తున్న టీఎస్‌ఆ ర్టీసీ ఇలా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సబబు అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3415
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author