బీజేపీకి షాక్… ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ!

బీజేపీకి షాక్… ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ!
October 15 22:44 2017

ఆరు నెలల కిందట జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో అకాళీదళ్- భాజపా సంకీర్ణ కూటమి ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి ఉంటుందని ఆశించిన బీజేపీకి అక్కడ భంగపాటు తప్పలేదు. ప్రజలు తాము కాంగ్రెస్ వెంటే ఉన్నామని మరోమారు తేల్చి చెప్పారు. గురుదాస్‌పూర్ పార్లమెంటు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ విజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే విజయం ఖరారు చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ సమీప ప్రత్యర్థి భాజపాకు చెందిన స్వర్ణ్ సాలారియాపై 1.70 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆప్ తరఫున బరిలో నిలిచిన మేజర్ జనరల్ సురేష్ ఖజారియాకు కూడా చెప్పుకోతగ్గ ఓట్లు లభించాయి. సీనియర్ నటుడు, భాజపా ఎంపీ వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

ప్రజలు తమవైపే ఉన్నారని, కేంద్రంలోని బీజేపీ పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కేరళలో జరిగిన వెంగారా అసెంబ్లీ స్థానం ఉపఎన్నికలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఈ స్థానంలో కాంగ్రెస్ కూటమి యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన కేఎన్‌ఏ ఖాదర్ ఎల్డీఎఫ్ అభ్యర్థిపై 23 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ భాజపా నాలుగో స్థానంలో నిలిచింది.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3513
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author