బుట్టా రేణుక “సైకిల్” ఎక్కటం ఖాయం..!

బుట్టా రేణుక “సైకిల్” ఎక్కటం ఖాయం..!
October 15 23:21 2017

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చంద్రబాబునాయుడును కలిసి… తాను పార్టీ మారేందుకు సిద్దమనే సంకేతాలిచ్చారట. ఫలితంగా సి.ఎం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక రేణుక అధికారికంగా పార్టీలో చేరతారని తెలుస్తోంది. జగన్ పాదయాత్రకు ముందే ఆమె చేరిక ఉండవచ్చని..త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రావచ్చంటున్నారు. ఇంతకు ముందే బుట్టా రేణుక మంత్రి నారా లోకేష్ తో మాట్లాడారు. ఇప్పుడు కాంట్రాక్టులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు హామీనిచ్చారని..అందుకే పార్టీ మారేందుకు సిద్దమయ్యారనే చర్చ సాగుతోంది. రానున్న ఎన్నికల్లో ఎంపీ సీటుతో పాటు ఎన్నికలకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని బుట్టా రేణుకకు వారు హామీ ఇచ్చారని సమాచారం. తక్షణమే రూ.70 కోట్ల భారీ ప్యాకేజీతో పాటు పలు కాంట్రాక్టులు కూడా కట్టబెట్టనున్నట్లు ఒక పత్రికలో కథనం రావడం హాట్ టాపికైంది. పత్రికలో ఆ కథనం రావడంతో ఇక బుట్టా పై ఆశలువదులుకున్నట్లేనంటున్నారు.  బుట్టా రేణుక భర్త నీలకంఠం నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డితో పాటు అమరావతికి వెళ్లి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత తాను మాట మార్చారు. ఎస్పీవై రెడ్డి కబురు పంపితే వెళ్లాను. అంతే తప్ప మరో కారణం లేదని సర్ది చెప్పారు. ఆ తర్వాత ఆయన వైకాపాలోనే వివిధ కార్యక్రమాల్లోచురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఇద్దరు వైకాపా ఎంపీలు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లారు. మరో ఇద్దరు అదే బాటలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా..వారిలో నలుగురుకి మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు మరికొందరు పార్టీ మారేందుకు సిద్దమవ్వడం ఉత్కంఠను రేపుతోంది.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3531
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author