అంబేద్కర్ సిద్ధాంతాన్ని అవపోసన పట్టిన మేధావి రవిబాబు

అంబేద్కర్ సిద్ధాంతాన్ని అవపోసన పట్టిన మేధావి రవిబాబు
October 15 23:42 2017

రవిబాబు వృత్తి రీత్యా ఆంధ్రప్రదేశ్ కు ఐఏఎస్ అధికారి,….ఆయన బాబా సాహెబ్ ఆలోచనా రీతులను, సిద్ధాంతాన్ని అవపోసన పట్టిన సమకాలీన మన మేధావి…రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలోని పలుప్రాంతాల్లో అంబేద్కర్ ఆలోచనా పరులకు ఉత్తేజాన్నీ,ప్రేరణను అందిస్తున్న మన తరం అంబేడ్కరీయులు. బాబా సాహెబ్ రచనలను, ఉపన్యాసాలను,రాజ్యాంగ చర్చలను ఆమూలాగ్రం చదివి -అంబేద్కర్ మహాశయుని మిషన్ ను నేటి తరానికి అందిస్తూ వారిలో అంబేద్కర్ ఆలోచనా విధానాలపట్ల ఆసక్తికి కలగచేస్తున్నారు. ముఖ్యంగా యువతరంతో  బాగా సాన్నిహిత్యం పెంచుకున్న ఆయన మొన్నటి అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన నాగార్జున యూనివర్సిటీ అధికారిక సదస్సు లో అంబేద్కర్ మిషన్ ను సుదీర్ఘంగా వివరించి వర్సీటీ స్టూడెంట్లను తన మేధో సంపత్తి తో ఆకట్టుకున్నారు.” ఈ తరానికి అంబేద్కర్ వ్యక్తిగా మాత్రమే తెలుసు -సిద్ధాంత పరంగా లోతుగా తెలియ చేయడం మాత్రమే తన పని. ఎంతో శక్తిమంతమైన నేటి తరం అంబేద్కర్ స్ఫూర్తి ,పోరాటపటిమ సరిగ్గా తెలియకపోవడం వాళ్ళ వారిలో అయోమయం,గందరగోళ ఆలోచనలు నెలకొన్నాయని భావిస్తున్న సమయంలో వారి సందేహ నివృత్తి చేయాల్సిన బాధ్యత మాతరం పై ఉన్నదని రవిబాబు నమ్ముతున్నారు.  ఇక వృత్తిగతంగా ఆయన సాధించిన ప్రతిభ తక్కువేమీకాదు. విజయవాడ మునిసిపల్ కమిషనర్ గా ఆరు జాతీయ, ఒక అంతర్జాతీయ అవార్డులు నగరానికి తెచ్చిపెట్టారు. ఉమ్మడి రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ గా ఈపాస్ విధానం అమలులో దేశానికే ‘మార్గదర్శకంగా ‘రాష్ట్రాన్ని నిలిపారు.  ప్రస్తుతం అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవ వేడుకలను ఒక పదిలక్షల మందితో ‘మిలియన్ మార్చ్’లా  నిర్వహించాలని తన శిష్యులు భావిస్తున్నారని ‘అంబేద్కర్ తాత్వికతను చదివిన తనకు  అది అత్యంత ఆనందకమైనదని చెబుతున్న గోరా రవిబాబు సార్ కు జైభీమ్ చెబుదాం …వీలైతే మాట్లాడండి …సార్ మొబైల్ :  9000510345

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3540
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author