పత్తి రాకతో మార్కెట్లు కళకళ

పత్తి రాకతో మార్కెట్లు కళకళ
October 17 18:19 2017

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కొత్త పత్తి రాకతో కళకళలాడుతుంది. రైతుల ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట చేతికి రావటంతో అమ్ముకునేందుకు మార్కెట్‌కు తరలిస్తున్నారు. పత్తి పంటకు ఈసారి అయిన గిట్టుబాటు ధర వస్తుందని ఆశించిన రైతులకు గత సంవత్సరంలాగానే వ్యాపారుల చేతుల్లో దోపిడి గురికాకతప్పటం లేదు. పత్తి సీజన్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మార్కెట్‌కు కొత్త పత్తి అధికశాతంగా వచ్చి చేరుతుంది. సోమవారం ఖమ్మం మార్కెట్‌కు కొత్త పత్తి 18,081బస్తాలు రావటంతో మార్కెట్‌లో వ్యాపారులు, రైతులతో కొంత సందడి నెలకొంది. ఈ నెల మొదటి వారంలో మార్కెట్‌లో సిసిఐని ప్రారంభించినప్పటికి ఇంతవరకు అమలుకు మాత్రం నోచుకోలేదు. సిసిఐ ద్వారా తమ పత్తి పంటకు కనీస మద్దతు ధర లభిస్తుందని ఎంతో ఆశగా మార్కెట్‌కు వస్తున్నామని రైతులు వెల్లడిస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన తరువాత సిసిఐ ఇంకా అమలులో లేదని తెలియటంతో తీసుకువచ్చిన పత్తి పంటను తిరిగి తీసుకువెళ్ళలేక వచ్చిన ధరకే అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. శనివారం మార్కెట్‌లో పాత పత్తికి 4,800రూపాయలు ఉండగా కొత్త పత్తికి 4,470రూపాయలను మార్కెట్ నిర్ణయించింది. మార్కెట్‌లో సిసిఐ లేకపోవటంతో వ్యాపారులు ముందుగానే రైతుల పంటలను పరిశీలించుకొని 3,200నుండి 3,700రూపాయలకు బేరసారాలు చేసిన తరువాత ఈనామ్ పద్దతిలో కొనుగోలు చేస్తుండటం గమనార్హం. దీంతో పత్తి రైతులు చేసేదేమిలేక వచ్చిన ధరకే పంటను అమ్ముకోవల్సి వస్తుందని వెల్లడిస్తున్నారు. దీనికి తోడు దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో వ్యాపారులు చెప్పిన ధరకే అమ్ముకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో ఇంత జరుగుతున్నప్పటికి మార్కెట్ అధికారులు సైతం పట్టించుకోకపోవటం లేదు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3800
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author