కేటీఆర్ కు ప్రతిష్టాత్మక ఆహ్వానం

కేటీఆర్ కు  ప్రతిష్టాత్మక ఆహ్వానం
October 17 18:31 2017
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావుకు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం లభించింది. అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ మరియు యూఏఈ లోని ప్రముఖ పారిశ్రామిక సంఘం అయిన బిజినెస్ లీడర్స్ ఫోరమ్నిర్వహించనున్న ఇండియా-యూఏఈభాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో భారతదేశంతోపాటు గల్ప్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు ఎనిమిది వందలకుపైగాపాల్గోన్ననున్నారు. దుబాయ్, యూఏఈ దేశాలతో భారత దేశ వాణిజ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నెల 30,31 తేదిల్లో ఈ సమావేశం దుబాయ్లో జరగనున్నది. 30న జరిగే మంత్రుల స్ధాయి షెషన్లో పాల్గోనాల్సిందిగా మంత్రి కెటి రామారావును నిర్వహాకులు కోరారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల మద్య ఉండాల్సిన వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యం, పెట్టుబడులు, పాలసీలు, టూరిజం వంటి అంశాలపైన మాట్లాడాల్సిందిగా  కోరారు. దీంతోపాటు తెలంగాణలోని ఉన్న పెట్టుబడులు అవకాశాల, ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలపైన ప్రసంగించాలని కోరారు. ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గోనాల్సిందిగా బిజినెస్ లీడర్స్ పోరమ్ మంత్రి అహ్వానం పంపింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3809
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author