BSNL ‘భారత్ 1’ ఫోన్‌ ధర రూ.2200

BSNL ‘భారత్ 1’ ఫోన్‌ ధర రూ.2200
October 17 19:14 2017
  • రూ.97 రీచార్జ్ తో  28 రోజులపాటు అపరిమిత కాల్స్, ఇంటర్నెట్‌

జీ వివోఎల్టీఈ టెక్నాలజీతో టెలీకాం రంగంలో రిలయన్స్ జియో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. జియో దెబ్బకి ఎయిర్‌టెల్, ఐడియా వంటి టెలీకాం కంపెనీలు విలవిల్లాడాయి. తమ 4జీ వివోఎల్టీఈ సర్వీసులను పట్టణ ప్రజలకే కాకుండా గ్రామీణ వినియోగదారులకు అందించడం కోసం జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. దీనికి కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే చాలా మంది చేతుల్లోకి జియోఫోన్‌లు చేరాయి. అయితే జియోకి పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన 4జీ వివోఎల్టీఈ ఫోన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మైక్రోమ్యాక్స్ కంపెనీతో కలసి రూపొందించిన ‘భారత్ 1’ ఫీచర్‌ ఫోన్‌ను మంగళవారం బీఎస్ఎన్ఎల్ విడుదల చేసింది.‘భారత్ 1’ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి బీఎస్ఎన్ఎల్ ఆకర్షనీయమైన ఆఫర్‌ను అందిస్తోంది. రూ.97తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజులపాటు అపరిమిత కాల్స్, ఇంటర్నెట్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కాగా, డ్యుయల్ సిమ్‌తో పనిచేసే భారత్ 1 ఫీచర్‌ ఫోన్‌లో 2 అంగుళాల తెర అమర్చారు. అలాగే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఫోన్‌ ధర రూ.2200. జియోఫోన్‌కి ఈ భారత్ 1 ఫోన్ గట్టి పోటీనివ్వడం ఖాయం.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3821
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author