దీపావళిపై జీఎస్టీ ప్రభావం

దీపావళిపై జీఎస్టీ ప్రభావం
October 18 15:29 2017

తిరుపతిలో దీపావళి పండుగ కళ తప్పింది. వ్యాపారస్తులు లక్షలాది రూపాయలు పెట్టి తాత్కాలిక లైసెన్సులు పొందినప్పటికి వ్యాపారాలు లేక వెలవెలపోతున్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి దీపావళి పండుగ నాడు లాభాలు ఆర్జించవచ్చని సంబరపడిన వ్యాపారులు ఆశలన్ని నిరాశలుగా మిగులుతున్నాయి.రెండురోజులే ఉన్నప్పటికి కనీసం ఉన్న సరుకు అమ్ముడుపోవడం లేదంటున్నారు. డీమానిటైజేషన్ ఎఫెక్ట్, జిఎస్టీ ప్రభావం ప్రజలు వద్ద నగదు ఉన్నా కోనేందుకు ముందుకు రావడం లేదంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఒకే దేశం ఒకే పన్ను విధానం ఈ దీపావళి  కి అణుబాంబు లా పేలింది.  పండుగనాడు టపాసుల షాపులు అన్ని వినియోగదారులతో కళ కళ ఆడవలసిన తరణంలో  కొనుగోలు దారులు లేక విలవిలలాడుతున్నాయి. పిల్లల సంతోషానికి ఆకాశమే హద్దుగా జరిగే దీపావళి కళ కోల్పోయింది. ప్రతిఏటా లక్షల రూపాయల వ్యాపారాలు చేసే షాపు యజమానులు నివేరపుతున్న పరిస్థితి తిరుపతిలో నెలకొంది

ఒకవైపు, వ్యాపారం అంతంత మాత్రమే అంటున్నా మరోవైపు, ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడుతున్నారు. దీనికి తోడు జిఎస్టీ  అంటూ ఆ పన్నుల భారం 28% ప్రజలు పైనే వేస్తుండటంతో ఎక్కువగా కొనుగోలు చేసేవారు మాత్రం ఈసారి కొద్దిపాటి సామగ్రి కొనుగోలుకు పరిమితం అవుతున్నారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3925
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author