ఈ ఏడాది దీపావళి వెలవెల

ఈ ఏడాది దీపావళి వెలవెల
October 18 16:35 2017

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో విశాఖ నగరం దీపావళి కాంతులు వెలవెల బోతున్నాయి. బాణాసంచా వ్యాపారులు బిక్కుబిక్కుమంటూ తమ వ్యాపారం నష్టాల బాట పడుతుందేమోనని ఆందోళన బాట పడుతున్నారు.ఈ యేడాది  విశాఖ నగరంలో సుమారు 500 పైగా బాణాసంచా దుకాణాలకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్, గాజువాక, గోపాలపట్నం, పెందుర్తి, మధురవాడ ప్రాంతాల్లో ఈ దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన ఆకాశం మేఘావృతమై ఉండడం, మరోవైపు జీఎస్టీ ప్రభావంతో బాణాసంచా ధరలు వివపరీతంగా పెరగడంతో కొనుగోలుదారులు లేక ఈ దుకాణాలు వెలవెలబోతున్నాయి.

ప్రస్తుత వాతావరణం అనుకూలించని నేపథ్యంలో బాణాసంచా వ్యాపారులు భయాందోళనలు చెందుతున్నారు.  ఇప్పటికే భారీగా స్టాక్ తెచ్చుకుని అమ్మకాలు చేసుకుందామనుకున్న వ్యాపారులు  వాయుగుండం దెబ్బతో లబోదిబోమంటున్నారు. టపాసులను ఎలాగైనా అమ్ముకుని సొమ్ము చేసుకుందామనుకుని వ్యాపారులు అనుకుంటుంటే టపాసులు కొంటే పేలుతాయా లేదా అని వినియోగదారులు జంకుతున్నారు. దీంతో బాణాసంచా వ్యాపారులకు భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. 80 శాతం డిస్కౌంట్లు ఇస్తాం కొనండి మహా్రపభో అని బతిమలాడుతున్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో వ్యాపారులు అయోమయంలో పడుతున్నారు.

ప్రతితి సంవత్సరం ఉత్తరాంధ్ర ప్రజలకు దీపావళి పండుగ దూరమవుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపాన్ల కారణంగా దీపావళి పండుగను పూర్తిస్థాయిలో చేసుకోలేకపోతున్నామని నగరవాసులు అభి్రపాయపడుతున్నారు. మరోవైపు    టపాసుల ధరలు ఆకాశాన్ని అంటడం, జీఎస్టీ ప్రభావంతో 30 శాతం పైగా విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు వర్షం కారణంగా అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. వెలుగుల దీపావళిని బాణాసంచాతో ఘనంగా జరుపుకుందామనుకున్న విశాఖ వాసులకు ఈ ఏడాది దీపావళి కాంతులు దూరం కానున్నాయని చెప్పవచ్చు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3939
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author