శీతల గిడ్డంగుల్లో మగ్గుతున్న శనగలు

శీతల గిడ్డంగుల్లో మగ్గుతున్న శనగలు
October 20 11:23 2017

ప్రకాశం జిల్లాలో శనగల ధర భారీగా తగ్గింది.  పంట అమ్ముకునే సమయంలోనే ధర తగ్గుతుండటంతో రైతన్నల పరిస్థితి దయనీయంగా ఉంది. గత సంవత్సరం రబీలో పండిన శనగ పంటను ఎక్కువమంది రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు. కొద్ది రోజుల వరకు విత్తనాల కోసం వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం అడిగేవారు కరువయ్యారు. శనగల నిల్వలన్నీ ప్రస్తుతం శీతల గిడ్డంగుల్లోనే మూలుగుతున్నాయి. గత మూడు నెలలుగా రాష్ట్రంలోని వ్యాపారులు శనగలు కొనుగోలు పెద్దగా చేయడంలేదు. విత్తనాల కోసం శనగలు కొనుగోలు చేయడం వల్ల ఇటీవల వరకు ధర కొంతమేర నిలబడింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో డిమాండ్‌ పూర్తిగా పడిపోయింది. దీంతో ధర పతనం కావడం మొదలైంది.

 

రెండు వారాల క్రితం క్వింటా శనగలు రూ.6, 200 కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.5 వేలుకు పడిపోయింది. వ్యవసాయ పనులకు ఆర్థిక అవసరాలతో శనగ అమ్ముదామంటే కొనేవారు కనిపించడంలేదని రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికందే సమయంలో స్థానిక వ్యాపారులు మహారాష్ట్రలో తక్కువ ధరకు కొనుగోలు చేసినిల్వ చేశారు. ఆ నిల్వలు ప్రస్తుతం అపరాల వ్యాపారులు అమ్ముకుంటున్నారు. రూ.5400లు చొప్పున క్వింటా కొనుగోలు చేసి ఇప్పుడు రూ.4800అమ్ముకోవాల్సి వస్తుందని ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి నిల్వచేసిన వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో 50శాతల గిడ్డంగులలో 12నుండి 13లక్షల క్వింటాళ్లు శనగలు నిల్వ చేశారు. ఇప్పటి వరకు అమ్మకాలు పోను ప్రస్తుతం 8లక్షల క్వింటాళ్లు ఉన్నట్లు మార్కెటింగ్‌ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఆరుగాలం శ్రమించి కష్టపడే రైతులు పంట విక్రయం సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దుస్థితి తొలగించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని రైతాంగం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తోంది.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4075
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author