సీబీఐ కోర్టుకు జగన్, గాలి జనార్ధన రెడ్డి

సీబీఐ కోర్టుకు జగన్, గాలి జనార్ధన రెడ్డి
October 20 16:34 2017

YSRCP అధినేత జగన్మోహన రెడ్డి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు నేడు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసు విచారణ కోసం ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్న సంగతి తెలిసిందే. అలాగే, ఓబులాపురం గనుల కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఈ రోజు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇరువురూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఒకరినొకరు క్షేమ సమాచారం కనుక్కొన్నారు. ఇదే కేసులకు గాను ఉమ్మడి ఏపీ మాజీ హోమ్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి తదితరులు కుడా హాజరయ్యారు. . జగన్, సబితా ఇంద్రారెడ్డిలు మాత్రం కళ్లతోనే పలకరించుకున్నారు.   వీఐపీలు కోర్టుకు వచ్చిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.  కేసు విచారణలో పాల్గొనాల్సిన నిందితులు, వారి తరఫు న్యాయవాదులను మినహా మరెవరినీ కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4111
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author