మైనార్టీలకు చంద్రబాబు ఎంతో చేసారు : హిదాయతుల్లా

మైనార్టీలకు చంద్రబాబు ఎంతో చేసారు : హిదాయతుల్లా
October 20 18:58 2017

కడప, అక్టోబర్ 20:

రాష్ట్రంలో మైనార్టీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని రాష్ట్ర ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయతుల్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కడప లో ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 400 మంది ముస్లిం మహిళలకు ఉచితంగా కుటుమిషన్ పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా ముస్లిం యువతులకు మైనార్టీ సంక్షేమ పధకాల పై అవగాహన కల్పించారు. ముస్లిం మైనార్టీ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయాతుల మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారనీ అన్నారు. ముస్లిం లకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశ పెట్టిన్నారు.ముస్లిం లకు కడప జిల్లాలో హజ్ హౌస్ నిర్మాణం ని చేప్పట్టిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యంమన్నారు. ప్రజలు ఇప్పటికేనా టీడీపీ పార్టీ కి ఓట్లు వేసి గైలిపించాలన్నారు. ముస్లిం మైనార్టీలకు రాజకీయ రావడానికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కుట్టు మిషన్ల పంపిణీలో ఎలాంటి అవినీతి కి ఆస్కారం లేదని, కుట్టు మిషన్లు పూర్తి ఉచితంగా వారికి శిక్షణ ఇచ్చి మరీ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి తీసుకుని వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4153
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author