సాయి ప్రజ్వల క్షేమం

సాయి ప్రజ్వల క్షేమం
October 20 21:00 2017

హైదరాబాద్, అక్టోబర్ 20:

మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో అదృశ్యమైన  విద్యార్థి సాయి ప్రజ్వల ఆచూకీ లభ్యం అయింది. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని అడ్డగుంటపల్లికి చెందిన విద్యాగిరి శ్రీనివాస్ రెండో కూతురు సాయిప్రజ్వల ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం హైదరాబాద్ లోని బండ్ల గూడ నారాయణ విద్యాసంస్థలో చేర్పించారు. ఈనెల 10వ తేదిన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఉంటున్న మేనమామ ఇంటికి సాయి ప్రజ్వల వచ్చింది. మరుసటి రోజు కనిపించకుండా పోయింది. పోలీసులు కాలనీలో అమర్చిన సీసీ కెమెరాల పుటేజీలను పరిశీంచారు. ప్రజ్వల ఒంటరిగా  వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆమె ఎక్కడికి వెళ్లిందీ తెలియరాలేదు. కానీ ఆమె వెళ్తూ.. అమ్మ, నాన్న, అక్క, తమ్ముళ్లకు లేఖ రాసి పెట్టి వెళ్ళింది. తాను అందరినీ ‘మిస్” అవుతున్నానని అందులో తెలిపింది. నారాయణ కళాశాల వేస్ట్ అని, అక్కడి సమస్యలతోనే విద్యార్థులంతా బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ప్రజ్వల రాసిన లేఖ పోలీసులకు చిక్కింది. ఈ మేరకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తిరుపతి, షిర్డీ ప్రాంతాలకు తల్లిదండ్రులతో కలిసి పోలీసు బృందం తిరుపతికి వెళ్ళాయి. అక్కడ హోటళ్లు, రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ల గాలించారు. ఫలితం లేకపోవడం తో తిరిగి వచ్చారు. మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వివరాలు రాబట్టారు. మెడిసిన్ చదువుకోవడం ఇష్టం లేకపోవడంతో సాయిప్రజ్వల వెళ్ళి పోయిన్నట్లు మల్కాజ్గిరి ఏసీపీ సందీప్ మీడియా కు చెప్పారు. విద్యార్థి ని తల్లిదండ్రులతో వెళ్ళడానికి ఇష్టం లేకపోవడంతో నగరంలో ని ఓ అనాధ ఆశ్రమంకు తరలించిన్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4176
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author