కాంగ్రెస్ ఫ్లెక్సీలో రేవంత్… కలకలం!

కాంగ్రెస్ ఫ్లెక్సీలో రేవంత్… కలకలం!
October 22 00:54 2017

వరంగల్, అక్టోబరు 21:

తెలంగాణలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరేలా వరంగల్లో ఓ ఫ్లెక్సీ వెలిసింది. ప్రజలకు “దీపావళి శుభాకాంక్షలు” చెబుతూ స్థానిక కాంగ్రెస్ నేతలు కృష్ణారెడ్డి, ఓర్సురాజు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలో హన్మకొండ-హైదరాబాద్ ప్రధాన రహదారిపై కాజీపేట వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో పాటు రేవంత్ ఫొటో ప్రధానంగా కనిపిస్తుండడం వరంగల్లో కలకలం సృష్టిస్తోంది. రేవంత్ చేరికను కాంగ్రెస్లోని పలువురు నేతలు ఆహ్వానిస్తున్నట్లు ఈ ఫ్లెక్సీ ద్వారా తెలుస్తోంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4237
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author