తప్పు ఉంటే వెనక్కి తీసుకుంటా: మోత్కుపల్లి

 తప్పు ఉంటే వెనక్కి తీసుకుంటా: మోత్కుపల్లి
October 22 01:19 2017

హైదరాబాద్, అక్టోబరు 21:

రేవంత్ రెడ్డి వల్ల పార్టీ కి నష్టమే తప్ప లాభం లేదని టీటీడీపీ సినీయర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో అయన మాట్లాడుతూ… ఎన్నో సంవత్సరాల నుంచి మేం పార్టీకి సేవ చేస్తున్నాం. రేవంత్ నిన్న గాక మొన్న టిడిపి లోకి వచ్చారు. రేవంత్ కాంగ్రెస్ వాళ్ళతో కలిసాడా లేదా అని అడగాల్సిన హక్కు మా పై ఉందని అన్నారు. రేవంత్ పై చర్యలు తీసుకోవాలంటే.. అది అధిష్టానం మాత్రమే తీసుకోవాలి. కాంగ్రెస్ తో కానీ ఇతర పార్టీలతో పొత్తుల విషయం పై రేవంత్ ఒక్కరే నిర్ణయం తీసుకునే అధికారం రేవంత్ కి లేదని అయన స్పష్టం చేసారు.

రేవంత్ ని సస్పెండ్ చేసే అధికారం నాకు లేదు. అది మా అధిష్టానం తీసుకుంటుంది.. ఆ అధికారం నాకు ఉంటే ఎప్పుడో సస్పెండ్ చేసే వాణ్నని అన్నారు.

నేను అసెంబ్లీ లో చాలా ప్రసంగాలు చేసాను. ఎన్టీఆర్, జనార్దన్ రెడ్డి హయాం నుంచి నేను ప్రసంగాలు చేసాను. ఎవ్వరూ నన్ను అడ్డుకోలేదు. నేను దళితున్ని, ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచాను. ఇవ్వాళ కూడా నామినేషన్ వేస్తే ఆలేరులో సులభంగా గెలుస్తానని అన్నారు. రేవంత్ తో వ్యక్తిగతంగా ఎలాంటి శతృత్వం లేదని అన్నారు.

కేంద్రంలో టిడిపి బీజేపీతో పొత్తుపెట్టుకొని,  రాష్టంలో కాంగ్రెస్ తో ఎలా  కలుస్తామని అయన ప్రశ్నించారు. టీఆరెస్ తో టిడిపి పొత్తుకోవడానికి అవకాశం ఉంది. కేంద్రంలో బీజేపీ తో ఇటు టీఆరెస్, అటు టిడిపి పొత్తు ఉంది..కాబట్టి యాంటీ కాంగ్రెస్ లో భాగంగా పొత్తు ఉండే అవకాశం ఉంటుందని అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4250
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author