యనమలకు రాజ్యసభ సీటు..!

యనమలకు రాజ్యసభ సీటు..!
October 23 13:18 2017

విజయవాడ, అక్టోబరు 23:

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ఉన్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విషయంలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఏపీలో త్వరలో మంత్రి వర్గ ప్రక్షాళన జరగనున్నదని, అప్పుడు చంద్రబాబు యనమలను తప్పించనున్నారనే మాట వినిపిస్తోంది. పార్టీలో అత్యంత సీనియర్ లీడర్లలో ఒకరైన యనమల స్థానంలో చంద్రబాబు కొత్త ఆర్థిక శాఖ మంత్రిని నియమించుకోనున్నారని ప్రచారం. ఎన్నికలే లక్ష్యంగా కూర్చబోయే కేబినెట్ లో యనమలకు స్థానం లభించడం కష్టమే అని ఇప్పుడు టాక్. యనమలను అలా వదిలేయడం లేదట, ఆయనను రాజ్యసభకు పంపనున్నారట చంద్రబాబు నాయుడు. త్వరలోనే ఏపీ కోటాలో రాజ్యసభ ఎన్నికలు రానున్నాయి. వాటిల్లో టీడీపీ వాటాగా రెండు సీట్లు దక్కుతాయి. ఆ సమయంలో యనమలకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే యనమల ప్రత్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. క్రితం సారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. చంద్రబాబు ఆశించిన స్థాయిలో యనమల పని చేయడం లేదని.. అందుకే ఈ మార్పు ఉండబోతోందని తెలుగుదేశంపార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం విశేషం. అయితే పార్టీ సీనియర్ అనే గౌరవంతో బాబు యనమలకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వనున్నారట.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4388
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author