ఏసీబీ వలలో అసిస్టెంట్ ఇంజనీర్

ఏసీబీ వలలో అసిస్టెంట్ ఇంజనీర్
October 23 16:13 2017

చిత్తూరు, అక్టోబరు 23:

సత్యవేడు  గ్రామీణ నీటి పారుదల శాఖ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న  ప్రేమకుమార్ రూ 20 వేలు లంచం తీసుకుంటు రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు.  సత్యవేడు మండలం రాజగోపాలపురం గ్రామంలో నీటి ట్యాంకర్ ద్వారా గ్రామస్తులకు సరఫరా చేసారు. దానికి  సంభందించిన బిల్లుల మంజూరు కోసం  రాజగోపాలపురం గ్రామ సర్పంచ్ భర్త రోశయ్య ను ప్రేమ్ కుమార్  20 వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడు.  లంచం ఇవ్వడం ఇష్టం లేని రోశయ్య ఏసిబి అధికారులకు పిర్యాదు చేశాడు.  దీంతో పధకం ప్రకారం ఏసీబీ అధికారులుప్రేమ్ కుమార్  లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. సత్యవేడు గ్రామీణ నీటి పారుదల  కార్యాలయంలో సోమవారం నాడు  ప్రేమకుమార్ ను  పట్టుకున్నారు.  ఏసీబీ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4447
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author