చిన్న తరహ పరిశ్రమలను ప్రోత్సహించాలి

చిన్న తరహ పరిశ్రమలను ప్రోత్సహించాలి
October 24 01:27 2017

“బంగారు తెలంగాణా అవార్డ్స్” ప్రదానోత్సవంలో బండారు దత్తాత్రేయ

అఖిల భారత చిన్న పరిశ్రమల మైనారిటీస్ కమిటీ, పరిశోధన మరియు శిక్షణా కేంద్రము వారి పదవ వార్షికోత్సవం సందర్భంగా “బంగారు తెలంగాణా అవార్డ్స్” ప్రధానోత్సవం నాంపల్లి లోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణా ఉద్యమంలో తమవంతు పాత్రను పోషించి బంగారు తెలంగాణాకోసం కృషి చేస్తున్న పలువురు పాత్రికేయులు,ఉద్యోగులు,స్వచ్చంద సంస్తలకు  “బంగారు తెలంగాణా అవార్డ్స్” అవార్డులను బహూకరించారు.ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రస్తుత సమాజం లో సామాన్య మద్య తరగతి ప్రజలు ఎక్కువని పెద్ద పెద్ద కంపినిలలో తయారయ్యే వస్తువులను కానీ స్తోమత లేనందున చిన్న తరహ పరిశ్రమల్లో తయారాయీ వస్తువులను కొనుగోలు చేస్తున్నారన్నారు.దీనితో చిన్నతరహ పరిశ్రమలకు ప్రోస్తాం తో పాటు అనేకమందికి స్వయం ఉపాది లబిస్తున్దన్నారు.ఈ నేపద్యం లో చిన్నతరహ పరిశ్రమలను ప్రోత్స హించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ముఖ్యంగా చిన్న పరిశ్రమల మైనారిటీస్ కమిటీ, పరిశోధన మరియు శిక్షణా కేంద్రము ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చి ప్రోస్త్స హించడం  అభినందనీయమన్నారు. అఖిల భారత చిన్న పరిశ్రమల మైనారిటీస్ కమిటీ అధ్యక్షుడు ఎస్జడ్ సయీద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జంట నగరాల నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ ఎన్ఎస్కేరాజు, సీనియర్ పాత్రికేయులు మహేశుని లక్ష్మయ్య తదితరులకు  బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కమిటి ఉపాధ్యక్షులు శ్యాంసన్ ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు , ప్రధాన ర్యదర్శి వీర్ ఆయుబ్ ఖాన్,లక్ష్మివాణి  తదితరులు  పాల్గొన్నారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4522
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author