రేవంత్ రెడ్డి పై వేటు వేస్తారా..

రేవంత్ రెడ్డి పై వేటు వేస్తారా..
October 24 13:20 2017

హైద్రాబాద్, అక్టోబరు 24:

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై వేటు వేయనుంది ఆ పార్టీ. క్రమశిక్షణను ఉల్లంఘించి.. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలవడమే ఇందుకు కారణం. అదే సమయంలో పార్టీ నేతలకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేయడం ఇందులో ప్రధాన అంశాలు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్న రేవంత్ రెడ్డి పై వేటు వేసేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి రాక ముందే ఆ పని చేయనున్నారు. ఈ మేరకు టీ.టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పై వేటు వేయాలని సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు వంటి వారు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈనెల 27న సి.ఎం చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రానున్నారు. అప్పటిలోపే రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కు ముగింపు పలకాలని చూస్తోంది టీడీపీ. లేకపోతే పార్టీ పరంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని అంచనా వేస్తోంది.

మరోవైపు పయ్యావుల కేశవ్ కూడ రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుమార్తె కవితతో వ్యాపారం చేయాలని చూసింది రేవంత్ రెడ్డి కాదా అన్నారు. వైకాపా అధినేత జగన్ తోను ఆయనకు బాగా సంబంధాలు ఉన్నాయన్నారు. ఇన్నాళ్లు ఈ సంగతులు బయట పెట్టని పయ్యావుల ఇప్పుడు మీడియా ముందు ఈ మాటలు చెప్పడం హాట్ టాపికైంది. మరోవైపు రేవంత్ రెడ్డిని తప్పించి ఆ స్థానంలో మోత్కుపల్లిని కూర్చోపెట్టేందుకు సిద్దమవుతోంది టీడీపీ అధిష్టానం. గవర్నర్ పదవి వస్తుందని ఆశగా ఎదురు చూసిన మోత్కుపల్లి…తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నాడు. కాంగ్రెస్ తో దోస్తీ వద్దని మోత్కుపల్లి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో తనకు సీటు వచ్చేలా మోత్కుపల్లి ఎత్తులు వేస్తున్నాడని తెలుస్తోంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4560
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author