జీఎస్టీకి కొత్త నిర్వచనం చెప్పిన రాహుల్..!

జీఎస్టీకి కొత్త నిర్వచనం చెప్పిన రాహుల్..!
October 24 13:27 2017
న్యూఢిల్లీ, అక్టోబరు 24:
జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అర్థం అంటూ జీఎస్టీకి ఓ కొత్త నిర్వచనం చెప్పారు రాహుల్ గాంధీ. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా.. అక్కడున్న ఓటర్లని ఉద్దేశించి మాట్లాడుతూ జీఎస్టీ దేశ ప్రజల పట్ల శత్రువుగా తయారైందని అన్నారు. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది చిరు వ్యాపారులు రోడ్డుపాలయ్యారని… కేంద్ర ప్రభుత్వం విధానాలని ఎండగట్టే ప్రయత్నం చేశారు రాహుల్.గుజరాత్ ప్రజలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం కావాలని, కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏమీ ఇవ్వడం లేదన్నారు. పటేల్ సామాజిక వర్గం నేత నరేంద్ర పటేల్‌కు లంచం ఇచ్చి అతడిని తమతో కలుపుకుపోయేందుకు ప్రయత్నించిందంటే బీజేపీ పరిస్థితి ఎంతకు దిగజారిందో ఓటర్లకి అర్థమవుతోంది. కానీ బీజేపీ ఎన్ని డబ్బులు ఇచ్చినా గుజరాత్ యువత అమ్ముడుపోయే రకం కాదనే విషయాన్ని బీజేపీ గ్రహించాలని రాహుల్ చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4562
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author