సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలి

సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలి
October 24 22:56 2017
నీటి పారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతో పాటు తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకునేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఎంత వీలైతే అంత వరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి.. నీటిని పొలాలకు మళ్లించాలని నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని సీఎం సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)లోని నీటి విడుదల వినియోగానికి సంబంధించి పాత కరీంనగర్ నిజామాబాద్ జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షనిర్వహించిదిశానిర్దేశంచేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని రకాల చెరువులను గోదావరి నీటితో నింపుకునే విధంగా కాల్వలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీరు అందుబాటులోకి వస్తున్నందున ఈ లోపుగానే ఆ పనులు చేసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులే ఈ పనుల విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ నిజాంసాగర్ ఎల్‌ఎండీ సింగూరులో మిషన్ భగీరథ అవసరాలకు పోను మిగతా నీటిని పంట పొలాలకు మళ్లించాలని ఆదేశించారు సీఎం. నిజాంసాగర్ సింగూరు ఘనపూర్ ఆనికట్ గుత్ప అలీసాగర్ లక్ష్మి కెనాల్ ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ నీటితో రెండో పంట పండించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని పొలాలకు నీరందించి.. పంటలు పండించే వరకు విశ్రమించకుండా అధికారులతో పనులు చేయించుకోవాలని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న పాత కరీంనగర్ జిల్లాలో ప్రతీ ఎకరాకు నీరు అందే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. రామగుండం ప్రాంతంలో వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆదేశించారు సీఎం. ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్ నిర్మించి పెద్దపల్లి రామగుండం మంచిర్యాల ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వాలని ఆదేశించారు. ఈ రెండింటికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ సామర్థ్యం పెంచాలి అన్ని రకాల కాల్వలు మరమ్మతులు చేయాలన్నారు. ఎస్సారెస్పీలో తొలి చివరి ఆయకట్టు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రణాళిక అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4602
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
kcr
  Categories:
view more articles

About Article Author