జనవరిలో భువనగిరి ఫోర్టు పెస్టివల్ 

జనవరిలో భువనగిరి ఫోర్టు పెస్టివల్ 
October 25 01:21 2017

హైదరాబాద్, అక్టోబరు 25:

పురావస్తు, సాంస్కృతిక, పర్యాటక, క్రీడల శాఖలను  అనుసంధానం చేసి భువనగిరి ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అన్ని అంగులతో అభివృద్ది చేస్తామని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వేంకటేశం తెలిపారు.భువనగిరి కోట అభివృద్ది పై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గోని క్షేత్రస్థాయిలో పర్యటించి  క్లైంబింగ్ స్కూల్, ఖిల్లా సందర్శనకు వచ్చిన వారికి టిక్కెట్లు జారీ చేసే విధానాన్ని పరిశీలించిన అనంతరం భువనగిరి ఖిల్లాను ఇటీవల అధిరోహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  ప్రభుత్వం యాదగిరి గుట్టను అభివృద్ది చేస్తున్న నేపధ్యంలో భువనగిరి కోటకు పర్యాటకులు పెద్దఏత్తున పేరిగే అవకాశం ఉందన్నారు. భువనగిరి కోట  అభివృద్ది లో భాగంగా కేబుల్ కార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 6 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు వెల్లడించారు. కోట పరిసర ప్రాంతంలో భూ సేకరణ వల్ల కోంత మేర జాప్యం జరిగిందని, వచ్చే జూన్, జులై లో కేబుల్ కార్  ఏర్పాటు పనులు పూర్తి చేస్తామన్నారు.పర్యాటక కేంద్ర అభివృద్దిలో భాగంగా జనవరి నేలలో భువనగిరి ఫోర్టు ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్లు తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రా వేంకటేశం వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతి, పరిపాలన దక్షతకు నిదర్శనంగా భువనగిరి కోటను అభివృద్ది చేస్తామన్నారు. ఆసియా ఖండంలోనే సింగిల్ రాక్  ఇంతపెద్ద ఏకశీల ఏక్కడలేదని, అందరికి అందుబాటులో ఉండేలా మౌళిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భువనగిరి కోట వద్ద క్రమం తప్పక అనునిత్యం ఉండేలా సాంస్కృతిక, మ్యూజికల్ ప్రదర్శనలను ఏర్పాటు పరిశీలిస్తామన్నారు. భువనగిరి కోట సాహసానికి , సాంస్కృతిక, సాహాస క్రీడలకు నిలువేత్తు నిదర్శనమన్నారు. ఎవరెస్టు శికరాన్ని అధిరోహించటానికి వెల్లే వారికి భువనగిరి కోట మెుదటి అడుగుగా నిలుస్తున్దన్నారు. భువనగిరి కోట  అభివృద్ది పై జరిగిన సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4636
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author