స్వచ్చ భారత్ కు సహకరించాలి : అహ్లువాలియా

స్వచ్చ భారత్ కు సహకరించాలి : అహ్లువాలియా
October 26 00:59 2017

సంగారెడ్డి గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా బహిరంగ మలవిసర్జన ను తగ్గించి  స్వచ్చ భారత్ రూపకల్పనలో తమవంతు సహకారాన్ని అందించాలని తాగునీరు పరిశుద్ధ నిర్వహణ శాఖ కేంద్ర మంత్రి  అహ్లువాలియా పేర్కొన్నా రు. బుధవారం సంగారెడ్డి మండలం కవలం పేట గ్రామంలో కేంద్రమంత్రి పర్యటించి స్వచ్చ భారత్ మిషన్ కార్యక్రమం అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం స్వచ్ఛ గ్రామీణ నిర్వహణ ఎలా జరుగుతుందని తెలుసుకోవడమే అని అన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలంటే బహిరంగ మలవిసర్జన ను విడనాడాలని అన్నారు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్ళు అయినా తరువాత కూడా కొన్ని ప్రాంతాలలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడం శోచనీయమన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు

ఇంటింటికి నల్ల నీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు ఇంటింటికి నల్లా నీరు వస్తే ప్రజలు నీటి అవసరాలు తీరుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా వర్షాకాలంలో నీరు కలుషితమై చిన్నారులు డయారియా బారిన పడుతున్నారని మంత్రి గుర్తు చేశారు.  పశువుల మల విసర్జన వలన ఎరువు తయారవుతుంద, ని మనిషి మలవిసర్జనతో విషపూరితమైన వాతావరణం ఏర్పడుతుందని మంత్రి అన్నారు ప్రతి ఏడాది సుమారు లక్ష మంది చిన్నారులు వివిధ రకాల వ్యాధుల వ్యాప్తి చెంది మృత్యువాత పడుతున్నారని దీనిని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని అన్నారు జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కన్నన్ మాట్లాడుతూ జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం 53 శాతం పూర్తయిందని సుమారు మరో 80 వేల వ్యక్తిగత  మరుగుదొడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. దాదాపు 74వేల వ్యక్తిగత మరుగుదొడ్లకు మార్కింగ్ పూర్తి చేసి పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

జిల్లాలు బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు కార్యచరణ ప్రణాళిక తయారు చేసి ప్రధాని గుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని కేంద్ర మంత్రికి కలెక్టర్ వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రాధాన్యతను తెలపడమే కాకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ముఖ్యంగా ప్రజల పరివర్తనలో మార్పు తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. వచ్చే ఏడాది మే మాసం కల్లా  జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4756
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author