అభివృద్దిని అడ్డుకోవడమే వాళ్ళ లక్ష్యం : కడియం శ్రీహరి

అభివృద్దిని అడ్డుకోవడమే వాళ్ళ లక్ష్యం : కడియం శ్రీహరి
October 26 01:30 2017

సంగారెడ్డి, అక్టోబర్ 25 :

స్థానికుల కు న్యాయం జరిగి ఉద్యోగ అవకాశాలు రావాలనే జిల్లా ప్రాతిపదికన 31 జిల్లాలకు ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ (టీఆర్టీ) ఇచ్చాము. దీనివల్ల అటవీ ప్రాంతాలైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అసిఫాబాద్ లలో కూడా స్థానికులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు లభిస్తాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికడియం శ్రీహరి అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, పుల్కల్ లో రెండు పాలిటెక్నిక్ కాలేజీలను అయన  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే బాబుమోహన్, మాజీ ఎంపీ మానిక్ రెడ్డి, స్థానిక అధికారులు, నేతలు పాల్గోన్నారు. ఈ సందర్బంగా శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి పనిని  అడ్డుకోవడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. 10 జిల్లాల పరంగా ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ స్థానికులకు అన్యాయం జరుగుతుంది. వెనుకబడిన జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా కొంతమంది కోర్టుకెళ్తున్నారని అయనఅన్నారు. డీ. ఈడి కోర్సు పూర్తి కాకుండా వారికి ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ లో అవకాశం ఇవ్వాలని కొంతమంది అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేనాటికే కోర్సు పూర్తి చేసి ఉండాలన్న నిబంధన ఉంది. దీనిని కాదని అవకాశం కల్పించలేమని స్పష్టం చేసారు.

2018 మార్చి నెలలో డి-ఈ డి కోర్సు పూర్తి చేసేవారికి ఇప్పుడు అవకాశం కల్పించడానికి నిబంధనలు ఒప్పుకోవు. డి. ఈడి విద్యార్థులు సరిగా నోటిఫికేషన్ చూడక ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని కోరుతున్నానని అన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో 57 పాలిటెక్నిక్ కాలేజీలంటే అందులో తెలంగాణ వచ్చాక ఇచ్చినవి 11 పాలిటెక్నిక్ కాలేజీలు. పాత పాలిటెక్నిక్ కాలేజీలలో 17 కాలేజీలకు భవనాలు లేవు . దీనిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినపుడు 17 భవనాల నిర్మాణానికి అనుమతినిచ్చారు. ఇందులో 15 పాలిటెక్నిక్ భవనాలను నిర్మించి ప్రారంభించికున్నాం. ఇంకో రెండు త్వరలో ప్రారంభిస్తామన్నారు.

గత ప్రభుత్వం పేపర్లపై కాలేజీలకు మంజూరు ఇచ్చింది. మాపై ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ కాలేజీలకు మంజూరు ఇచ్చి వాటి భవనాలు, నిధులు, సిబ్బంది ఎందుకు మంజూరు చేయలేదో చెప్పాలని అన్నారు.

పాలమూరు, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయలు ఇచ్చి నిధులు, సిబ్బంది ఇవ్వకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీ లకు 420 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 1550 పోస్టులు మంజూరు చేసి 1061 పోస్టులు ఈ ఏడాది భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. టి ఆర్ ఎస్ ప్రభుత్వం  కాలేజీలకు భవనాలు, నిధులు, సిబ్బంది మంజూరు చేస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తోందని అన్నారు. గత రెండేళ్లుగా 246 కోట్ల రూపాయలతో 17 పాలిటెక్నిక్ భవనాలు, 22 హాస్టల్స్ నిర్మాణం చేస్తున్నామన్నారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4761
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author