లండన్ లో అమరావతి అభివృద్ధిపై చర్చ

లండన్ లో అమరావతి అభివృద్ధిపై చర్చ
October 26 01:54 2017

నవ్యాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా, స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలో… రెండో రోజైన బుధవారం నార్మన్‌ ఫోస్టర్‌ రూపకర్తలతో సమాలోచనలు, వరుస ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. యూకే మంత్రి ప్రీతి పాటెల్ చంద్రబాబును కలిసారు. నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై వారు చర్చించారు. యూకే ఆంధ్రప్రదేశ్‌కు ఏయే అంశాల్లో సహకారం అందించగలదన్న విషయంపై చంద్రబాబు ఆమెతో చర్చించారు. ఐరోపా, యూకేలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక విధానాలను అందించి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడాలని చంద్రబాబు కోరారు. కొత్త రాష్ట్రంలో సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

మరోవైపు చంద్రబాబుతో గ్లోబల్ కార్పొరేట్ బ్యాంకింగ్ సంస్థ ‘శాంటండర్’ ఇండియా డెస్క్ డైరెక్టర్ ఎడ్వర్ట్ డిక్సన్, ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఏజన్సీ ఫైనాన్స్ హెడ్ ఫిలిప్స్‌ సమావేశమైంది. యూకేలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ శాంటండర్. గుంటూరు నుంచి మిర్చి ఎగుమతుల వ్యవహారాలతో పాలుపంచుకుంటున్న సంస్థగా ఏపీతో అనుబంధం ఉంది. ఏపీ ఉత్పత్తుల విక్రయాల్లో అక్కడి ఎగుమతిదారులకు, యూకేలో దిగుమతిదారులకు సాయం అందించడానికి బ్యాంక్ ఆసక్తి చూపుతోంది. ఫిన్‌టెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ కావడంతో ఏపీలో ఫిన్‌టెక్ వ్యాలీకి సహకరించాలని చంద్రబాబు కోరారు. ఆహారోత్పత్తుల తయారీ, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు ఆర్థికంగా ఊతమిచ్చేందుకు సంస్థ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4767
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author