రేవంత్ కు టీఆర్ ఎస్ షాక్

రేవంత్ కు టీఆర్ ఎస్ షాక్
October 26 03:08 2017

పార్టీ మార్పుపైన డైలమాలో ఉన్న రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది.సందు చూసుకొని ఆయన బలగాన్ని గోడదూకిస్తోంది.ఇంతకాలం ఆయనకు అండగా నిలిచిన నాయకులకు గులాబీ కండువాలు కప్పేస్తుంది.రేవంత్ రెడ్డికి పెట్టని కోటగా ఉన్న కొడంగల్ లో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ఎట్టకేలకు విజయవంతమౌతోంది.ఎన్నో దండయాత్రల తర్వాత కొడంగల్  నియోజకవర్గంలో టీఆర్ఎస్ పాగా వేయగల్గుతోంది. రాష్ట్రమంతా అన్ని పార్టీల నాయకులకు విజయవంతంగా గులాబీ కండువాలు  కప్పిన అధికార పార్టీ ఇంత కాలానికి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కాలుమోపింది. తన పార్టీ ప్రజాప్రతినిధులను చెక్కుచెదరకుండా ఇన్ని రోజులు కాపాడుకున్న రేవంత్ కి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. తెలుగుదేశంలో ఉండాలా లేక కాంగ్రెస్ లో చేరాలన్న డైలామాలో ఉన్న రేవంత్ రెడ్డిని అదును చూసి గులాబీ పార్టీ దెబ్బకొట్టింది. అయోమయస్థితిలో టీడీపీ నుంచి భారీగా వలసలను ప్రోత్సహించడానికి మంత్రులు వేస్తున్న వ్యూహాలు ఫలిస్తున్నాయి.

ప్రధానంగా కొడంగల్ లో రేవంత్ ను బలహీనపర్చే ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. చాలా కాలం నుంచి ఇక్కడి టీడీపీ ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ లోకి తీసుకురావడానికి ఆ పార్టీ  చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌ఎట్టకేలకు ఫలితాలను ఇస్తోంది. టీడీపీ నాయకులను చేర్చుకోవడానికి గత మూడున్నరయేళ్లుగా జిల్లా టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే తెలుగు తమ్ముళ్లేవ్వరు రేవంత్ రెడ్డి మాట దాటలేదు. అయితే గత పది రోజులుగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కొడంగల్ సమీకరణాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో కార్యకర్తలు, నాయకుల్లో గందరగోళం నెలకొన్నది. ఆయన పార్టీలో కొనసాగుతారా లేక ఉంటారా అన్న దానిపైన స్పష్టత రాకపోవడంతో అందరిలోనూ అయోమయం ప్రారంభమైంది.

ఈ పరిస్థితులను తనకనుకూలంగా మలుచుకున్న టీఆర్ఎస్ మంత్రులు జూపల్లి క్రిష్ణారావు, మహేందర్ రెడ్డి కొడంగల్ పైన కన్నేశారు. రేవంత్ రెడ్డి డైలామా పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే గుట్టు చప్పుడు కాకుండా కొడంగల్ టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. తమ నాయకుడే అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో స్థానిక నేతలు ఈ సారి టీఆర్ఎస్ వలకు చిక్కారు. రేవంత్ రెడ్డి మేల్కునే లోపే ఇద్దరు జడ్పీటీసీలు, పలువురు సర్పంచ్ లు, ఎం.పి.టి.సిల మెడల్లో గులాబీ కండువా కప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డిని కొడంగల్ లో వీక్ చేయాలన్న పట్టదలతో  మంత్రులు చాలా పెద్ద స్కెచ్ వేసినట్లు సమాచారం. అయితే కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఏమీ చేయకపోవడం వల్లనే ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. జడ్పీటీసీలు, సర్పంచ్‌లను చేర్చుకోవడం కోసం మంత్రులు ఆపోసోపాలు పడుతున్నారని రేవంత్ రెడ్డి వర్గీయులంటున్నారు. అయితే పునాదులను దెబ్బతీస్తే భవనం దానికదే పడిపోతుందన్న సిద్దాంతాన్ని గట్టిగా నమ్ముతున్న టీఆర్ఎస్ మరిన్ని వలసల వేటలో పడింది. టీడీపీలో ఉండాలా, కాంగ్రెస్ లో చేరాలా అని రేవంత్ రెడ్డి మదనపడుతుంటే ఆయన అనుచరులు మాత్రం టీఆర్ఎస్ లో చేరుతున్నారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4802
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author