పసికందు కిడ్నాప్ ఘటన విషాదాంతం

పసికందు కిడ్నాప్ ఘటన విషాదాంతం
October 26 03:32 2017

హైదరాబాద్: నీలోఫర్‌లో కిడ్నాప్ ఘటనలో పసికందు అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. వివరాల్లోకి వెళితే నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లిలో… కిడ్నాపర్ మంజుల పసికందు మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఆదివారం అర్ధరాత్రి తరువాత పసికందు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఉప్పుగూడకు చెందిన నిర్మల.. ఈనెల 20న హైదరాబాద్ పేట్ల బురుజు ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. అయితే, బిడ్డ అనారోగ్యంతో ఉండడంతో అక్కడి నుంచి నీలోఫర్‌కు తీసుకెళ్లాలని సూచించారు వైద్యులు. ఓ ఆంబులెన్స్‌లో బిడ్డ, బిడ్డ తల్లి నిర్మల, అమ్మమ్మ కల్పన వచ్చారు. అదే సమయంలో తాను ఆయానని.. వారికి సాయం చేస్తానంటూ వచ్చింది మంజుల అనే మహిళ. వరంగల్ జిల్లా కే సముద్రం గ్రామానికి చెందిన మంజుల.. వారితో పాటు.. పేట్ల బురుజు ఆస్పత్రి నుంచి నీలోఫర్ వరకు వెళ్లింది. వైద్య చికిత్సలు జరిగినంతసేపు వారితోనే ఉండి నమ్మకం కలిగించింది. మధ్యాహ్నం సమయంలో తన పథకం అమలు చేసింది. చికిత్స పూర్తయి.. మళ్లీ పేట్ల బురుజు ఆస్పత్రికి బాబును తీసుకెళ్లే సమయంలో.. చిన్నారి అమ్మమ్మను టీ తేవాలని కోరింది. ఆమె అటు వెళ్లగానే.. ఇటు బాబుతో సహా ఉడాయించింది మంజుల.

చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. మొత్తం 15 బృందాలు గాలించాయి. ఆస్పత్రులు.. గ్రామాలు.. మండలాలు మొత్తం గాలించారు. చివరకు వెల్దండ మండలం బండోనిపల్లికి చెందిన ఓ వ్యక్తి.. కిడ్నాపర్ ఫొటోను గుర్తు పట్టడంతో కేసు కొలిక్కి వచ్చింది. చివరకు కాటేదాన్‌లో మంజుల, ఆమె భర్త కుమార్ గౌడ్ ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో కిడ్నాప్ కథ మొత్తం చెప్పింది మంజుల.

వరంగల్ జిల్లాకు చెందిన మంజులకు.. వెల్దండ మండలం బండోనిపల్లికి చెందిన కుమార్ గౌడ్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే, తొలుత ఓ సారి గర్భస్రావమైంది. ఆ తర్వాత మూడు నెలల క్రితం మరోసారి.. ఐదో నెలలో అబార్షన్ అయింది. రెండోసారి కూడా బిడ్డ పోయిందని భయపడిన మంజుల.. ఆ విషయాన్ని భర్త, అత్తమామలతో చెప్పలేదు. తాను గర్భిణి అనే చెబుతూ దాటవేసింది. చివరకు నెలలు నిండడంతో ఏం చేయాలా అని ఆలోచించి.. ఈ కిడ్నాప్ ప్లాన్ వేసింది. బంధువుల దృష్టిమరల్చి పసికందును కిడ్నాప్ చేసానని ఒప్పుకుంది.  మంజుల, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వివరించారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4814
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author