ప్రీపెయిడ్ ద్వారా కరెంట్ బిల్లు

ప్రీపెయిడ్ ద్వారా కరెంట్ బిల్లు
October 26 20:09 2017

కరెంట్ బిల్లు లైన్‌లో నిలబడి కట్టుకునే వినియోగదారులకు ప్రతినెల ప్రీపెయిడ్ ద్వారా  బిల్లు చెల్లించే విధంగా విద్యుత్ సంస్థ నూతన వ్యవస్థను శ్రీకారం చుట్టేందుకు కసరత్తు చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎన్‌పీడీసీఎల్ సర్కిల్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినియోగదారులకు ప్రీపెయిడ్ ద్వారా విద్యుత్ వినియోగించే విధంగా చర్యలు చేపడుతుంది. మొదటిదఫాగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తుంది. ప్రతినెలప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులను పెండింగ్ ఉండటంతో అలాంటి కార్యాలయాల్లో ప్రీపెయిడ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. వీరికోసం ఫ్రీపెయిడ్ మీటర్లను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. విద్యుత్ బిల్లులను చెల్లించే విధంగా విద్యుత్‌శాఖ సరికొత్త మార్పులను తీసుకొస్తోంది. ఇప్పటివరకు కరెంట్ వాడుకుని పోస్ట్‌పెయిడ్ రూపంలో మరుసటి నెల బిల్లులు చెల్లించే మనం ఇకపై ఈ విధానానికి స్వస్తి పలకాల్సి వస్తుంది. సెల్‌ఫోన్‌లో ఎలాగైతే ముందుగా కార్డు కొనుగోలు చేసి రీచార్జ్ చేస్తామో అదేవిధంగా కరెంట్ కోసం ముందుగానే రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇకపై మన ఇంటి బిల్లు ఎంత వాడుకున్నాం. దాని ఖర్చు అవుతుంది..? ఇంకా ఎంత నిలువ ఉంది..? అనే విషయాలు సులువుగా కొత్తగా వచ్చే ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలోని 5,950 ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే ఈ ఫ్రీపెయిడ్ అమరుస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా వినియోగదారుల నుంచి మరుగైన స్పందన లభిస్తే క్రమక్రమంగా గృహాలకు విస్తరించవచ్చు. ప్రతిరోజు మారుతున్న సాంకేతిక కారణాలు, టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు, మొండిబకాయిలను వసూలు చేసేందుకు విద్యుత్ సంస్థ నూతనంగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చేందుకు ఆలోచనకు వినియోగదారులకు స్పందన మెండుగా కన్పించే అవకాశముంది.

ఉమ్మడి జిల్లాకు ఎన్‌పీడీసీఎల్ సంస్థ 500 ఫ్రీపెయిడ్ మీటర్లను పంపించి మొదటి దఫాలో ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలున్నాయి. కొత్తగా మంజూరైన ప్రీపెయిడ్ మీటర్లు రెండు, మూడు రోజుల్లో జిల్లాకు రానున్నాయి.ప్రీపెయిడ్ మీటర్లను ఉపయోగించడం ద్వారా విద్యుత్ బిల్లులను ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. రీచార్జ్ ద్వారా ఎంత నగదును చెల్లిస్తున్నామో అంతమేరకే విద్యుత్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్‌లో రీచార్జ్ చేసుకన్నట్లే విద్యుత్ కోసం ముందుగానే ప్రీపెయిడ్ కార్డుతో రీచార్జ్ చేసుకోవాలి. వినియోగదారులు రెండు రకాలుగా రీచార్జ్ చేసే అవకాశాన్ని విద్యుత్ శాఖ కల్పిస్తుంది. ఫ్రీపెయిడ్ కార్డులను కొత్తగా అమర్చిన కస్టమర్ ఇంటర్‌ఫేస్ యూనిట్‌లో మొబైల్‌కు ఉన్నట్లుగానే కీప్యాడ్ ఉంటుంది. కొనుగోలుచేసిన రీచార్జ్ కార్డులోని 12 అంకెలను మీటర్‌లో ఎంటర్ చేస్తే రీచార్జ్ అవుతుంది. అందుబాటులో ఉండే విద్యుత్ కౌంటర్‌లలో రీచార్జ్ కార్డులు లభిస్తాయి.రెండవది ఇంటర్ ఫేస్ యూనిట్ ద్వారా రీచార్జ్ ఇంటి నుంచే చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంటర్నెట్ సహాయంతో డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డులను ఉపయోగించి అవసరమైన మేర రీచార్జ్జ్‌లను చేసుకోవచ్చు. ప్రతి నెల ఎంతమేర రీచార్జ్ కార్డులు అవసరంపడతాయో ఈఆర్‌ఓ కార్యాలయ సిబ్బంది అంచనాలు తయారు చేసి ఎప్పటికప్పుడు రీచార్జ్ కార్డులను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4893
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author